దశ తిరుగుతోంది..!

Mon 15th Feb 2016 08:29 PM
mickey j meyer,brahmothsawam,a aa movie,robin hud  దశ తిరుగుతోంది..!
దశ తిరుగుతోంది..!
Advertisement
Ads by CJ

తెలుగులో నెంబర్‌ వన్‌ సంగీత దర్శకుడు ఎవరు? అంటే అందరూ ఠక్కున దేవిశ్రీప్రసాద్‌, కీరవాణి, తమన్‌ల పేర్లు చెబుతారు. వారి స్థాయిలో కాకపోయినా తన టాలెంట్‌తో యువ సంగీత దర్శకుడు మిక్కీజెమేయర్‌ కూడా మంచి మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాడు. ఇంతవరకు కేవలం శ్రీకాంత్‌ అడ్డాల, శేఖర్‌కమ్ముల వంటి దర్శకులకే పరిమితం అయిన మిక్కీజెమేయర్‌ ఇప్పుడు తన పరిధిని పెంచుకుంటున్నాడు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తర్వాత ఆయన తాజాగా శ్రీకాంత్‌ అడ్డాల-మహేష్‌బాబుల కాంబినేషన్‌లో పివిపి సంస్థ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న 'బ్రహ్మూెత్సవం' చిత్రానికి సంగీతం అందిస్తున్నాదు. ఇక త్రివిక్రమ్‌శ్రీనివాస్‌ దర్శకత్వంలో నితిన్‌ హీరోగా రూపొందుతున్న 'అ..ఆ' చిత్రానికి అనిరుద్‌ స్థానంలో మిక్కీజెమేయర్‌ సంగీత దర్శకునిగా ఎంపికయ్యాడు. ఇక త్వరలో ప్రారంభం కానున్న రవితేజ హీరోగా చక్రి అనే నూతన దర్శకుడిని పరిచయం చేస్తూ డివివి దానయ్య నిర్మిస్తున్న 'రాబిన్‌హుడ్‌' చిత్రానికి కూడా మిక్కిజెమేయర్‌ సంగీత దర్శకునిగా పనిచేయనున్నాడు. మొత్తానికి క్లాస్‌ సినిమాలకే కాదు... 'సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌' చిత్రానికి మాస్‌ సంగీతాన్ని కూడా అందించి ప్రశంసలు అందుకుంటున్న ఈయన రాబోయే రోజుల్లో అనూప్‌రూబెన్స్‌తో పాటు మరికొందరు సంగీత దర్శకులకు మంచి పోటీనే ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ