నాని డబుల్ ధమాకా!

Mon 15th Feb 2016 03:36 PM
nani,krishnagadi veeraprema gada,dhamaka,indraganti mohan krishna  నాని డబుల్ ధమాకా!
నాని డబుల్ ధమాకా!
Advertisement
Ads by CJ

'ఎవడే సుబ్రమణ్యం','భలే భలే మగాడివోయ్','కృష్ణగాడి వీరప్రేమ గాథ' చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన హీరో నాని రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రొడ్యూసర్స్ కూడా అతని డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. మినిమం గ్యారంటీ  హీరోల జాబితాలోకి చేరిపోయాడు. ప్రస్తుతం నాని తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో 'ధమాకా' అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ రెండు నెలలు పాటు కూడా జరిగిందని తెలుస్తోంది. ఈ సినిమాలో మళయాళం నటి నివేద ధామస్, సురభి హీరోయిన్స్ గా చేస్తున్నట్లు సమాచారం. ఈ 'ధమాకా' చిత్రంలో డ్యూయిల్ రోల్స్ కు ఓ చిత్రమైన లింక్ ఉంటుందని, ఇప్పటివరకూ అలాంటి పాయింట్ తో సినిమా రాలేదని చెప్తున్నారు. మరి నాని ఈ డబుల్ 'ధమాకా' తో సెకండ్ హ్యాట్రిక్ ప్రారంభిస్తాడేమో చూడాలి..!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ