Advertisementt

నాగశౌర్య నూతన చిత్రం..!

Sat 13th Feb 2016 02:18 PM
naga shourya,lorgon entertainments,sai chaitanya  నాగశౌర్య నూతన చిత్రం..!
నాగశౌర్య నూతన చిత్రం..!
Advertisement
Ads by CJ

కెరీర్‌ ప్రారంభం నుంచి లవ్‌స్టోరీలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నాగశౌర్య ఇప్పుడు కథా బలమున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా నూతన నిర్మాత రామ అక్కల ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. లార్గన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందనున్న చిత్రమిది.  పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన సాయి చైతన్య ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ నెలాఖరులో లాంచనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి మార్చిలో రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తారు. 

రామ అక్కల పదేళ్లుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో పంపిణీదారులుగా వ్యవహరిస్తున్నారు. అంతే కాదు అక్కడ మల్టీప్లెక్స్‌ థియేటర్‌లను కూడా నిర్మిస్తున్నారు. న్యూజీలాండ్‌, ఆస్ట్రేలియా దేశాల్లో విడుదలయ్యే భారీ బడ్జెట్‌ చిత్రాలన్నీ రామ రిలీజ్‌ చేసినవే. సినిమాపై వారికున్న ప్రేమతో కథాబలమున్న చిత్రాలను నిర్మించి ప్రేక్షకుల మన్ననలు పొందాలనే కాంక్షతో నిర్మాణరంగంలోకి అడుగుపెడుతున్నారు. నాగశౌర్య హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని నాలుగు భాషల్లో రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెలాఖరులో సినిమా ప్రారంభించి మార్చిలో రెగ్యూలర్‌ షూటింగ్‌కి వెళ్తారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ