Advertisementt

లేడీ బాహుబలి..!

Fri 12th Feb 2016 05:18 PM
samantha,weight lifting,queen movie,thyagarajan  లేడీ బాహుబలి..!
లేడీ బాహుబలి..!
Advertisement
Ads by CJ

సాధారణంగా జిమ్‌లో భారీ భారీ ఎక్సర్‌సైజ్‌లు, సిక్స్‌ప్యాక్‌ కోసం హెవీ ఎక్సర్‌సైజ్‌లను హీరోలు చేయడం కామన్‌గా చూస్తూనే ఉంటాం. అయితే హీరోయిన్లు అయితే యోగాలు, సింపుల్‌ ఎక్సర్‌సైజ్‌లతో సరిపెడుతూ ఉంటారు. కానీ తాజాగా హీరోయిన్‌ సమంత జిమ్‌లో భారీ కసరత్తులు చేస్తున్న వీడియో ఇప్పుడు అన్నిచోట్లా హల్‌చల్‌ చేస్తోంది. ఈమె త్వరలో తమిళంలో ఓ భారీ యాక్షన్‌ సినిమాను చేయనుందని, ఇది లేడీ ఓరియంటెడ్‌ సబ్జెక్ట్‌ అని, అందుకే ఆ పాత్ర కోసం సమంత అంతటి కష్టతరమైన కసరత్తులను చమటోడుస్తూ కష్టపడుతోందని కోలీవుడ్‌ సమాచారం. అది మరేదో కాదు.. హిందీలో సూపర్‌హిట్‌ అయిన 'క్వీన్‌' చిత్రానికి రీమేక్‌ అని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన దక్షిణాది రీమేక్‌ హక్కులను దర్శకనిర్మాత, హీరో ప్రశాంత్‌ తండ్రి త్యాగరాజన్‌ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆ పాత్రను తమిళ, తెలుగు భాషల్లో సమంత చేయనుందని, అందుకోసం ఆమె ఏకంగా 150కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌ను చేసి వావ్‌.. అనిపించుకుంటోందని కోలీవుడ్‌ మీడియా అంటోంది. మరి సమంత కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది...! 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ