నాని ముక్కుసూటితనం..!

Fri 12th Feb 2016 02:50 PM
nani,bhale bhale magadivoy,krishangadi veera premagada  నాని ముక్కుసూటితనం..!
నాని ముక్కుసూటితనం..!
Sponsored links

'భలే భలే మగాడివోయ్‌' చిత్రంతో 35కోట్ల క్లబ్‌లో చేరిన నేచురల్‌స్టార్‌ నాని మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్లు చెబుతాడు. సాదారణంగా ఏ హీరో లేదా హీరోయిన్‌ని అయినా మీరు పారితోషికం పెంచారట కదా! అని అడిగితే.... అబ్బే అదేం లేదు... అంతా మీడియా ప్రచారం... కావాలంటే మా నిర్మాతలను అడగండి... అంటూ విషయాన్ని దాటేస్తారు. కానీ నాని మాత్రం ఈ విషయంలో ముక్కుసూటిగా సమాధానం చెప్పాడు. 'భలే భలే మగాడివోయ్‌' చిత్రంతో టాప్‌లీగ్‌లోకి చేరిన నానిని ఇటీవల మీరు పారితోషికం పెంచారట కదా! అని మీడియా వారు ప్రశ్నిస్తే... నిజమే... సినిమాని బట్టి బడ్జెట్‌, బడ్జెట్‌ను బట్టి పారితోషికం పెరుగుతుంది. నేను సహాయ దర్శకునిగా మొదటి సినిమా చేసినప్పుడు రెండు వేలు ఇచ్చారు. రెండో సినిమాకి మూడున్నర వేయి ఇచ్చారు. ఇప్పుడు నేను హీరోని కాబట్టి పారితోషికం అందుకు తగ్గట్లుగా పెంచాల్సిందే కదా...! అంటూ తన మాటలతో అసలు విషయాన్ని సూటిగా, సుత్తి లేకుండా చెప్పేశాడు నాని. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019