Advertisementt

జూ ఎన్టీఆర్, దేవా గోకిగెన్ యో!

Thu 11th Feb 2016 04:55 PM
junior ntr,nannaku prematho,japan release  జూ ఎన్టీఆర్, దేవా గోకిగెన్ యో!
జూ ఎన్టీఆర్, దేవా గోకిగెన్ యో!
Advertisement
Ads by CJ

ఎన్టీయార్ ఫాలోయింగ్ ఏ రేంజులో ఉంటుందో అక్కడ అమెరికాలో, ఇక్కడ ఆంధ్ర అండ్ తెలంగాణాలో రుజువు చేసిన సినిమా నాన్నకు ప్రేమతో. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు జపాన్ బయల్దేరింది. అవును నాన్నకు ప్రేమతోని జపాన్ అంతటా ఈ నెల 14న విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ముందుగా జపాన్ భాషలో డబ్బింగ్ చేసి వదులుదామనుకున్నా ఆఖరి నిమిషంలో తెలుగు వర్షన్ విత్ సబ్ టైటిల్స్ అని కన్ఫర్మ్ చేసారు. వేసవి సెలవుల్లో డబ్బింగ్ వర్షన్ మరోసారి రిలీజవుతుంది. ఇంతకుమునుపు కూడా తారక్ చిత్రం బాద్షాని జపాన్లో విడుదల చేస్తే వసూళ్లు కుమ్మేసింది. అందుకే ఈసారి కూడా జపాన్ ప్రేక్షకులు నాన్నకు ప్రేమతోలోని ఎమోషన్, లాజిక్కుకి ఫిదా అయిపోతారు అని వాణిజ్య విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సో, ఎన్టీఆర్ దేవా గోకిగెన్ యో... అదేనండి జపాన్ భాషలో ఆల్ ద బెస్ట్ చెబుతున్నాం! 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ