Advertisementt

ఆ మూవీ ముగ్గురికీ అగ్నిపరీక్షలాంటిది!

Sun 07th Feb 2016 09:40 PM
krishnastami,sunil,dil raju,vasu varma,josh movie director  ఆ మూవీ ముగ్గురికీ అగ్నిపరీక్షలాంటిది!
ఆ మూవీ ముగ్గురికీ అగ్నిపరీక్షలాంటిది!
Advertisement
Ads by CJ

సునీల్‌ హీరోగా నటించిన చిత్రం విడుదలై దాదాపు రెండేళ్లు దాటింది. ఆయన చిత్రాలు వరుసగా అందరినీ నిరాశపరుస్తున్న నేపథ్యంలో ఆయన లాంగ్‌ గ్యాప్‌ తీసుకొని 'కృష్ణాష్టమి' చిత్రంతో ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కాగా 'జోష్‌' చిత్రంతో దర్శకునిగా మంచి అవకాశం వచ్చినప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన వాసువర్మకు ఈ సినిమా అగ్నిపరీక్షగా మారింది. మరో వైపు ఇటీవల పంపిణీదారునిగా తప్ప నిర్మాతగా పెద్ద హిట్‌ కొట్ట్లలేకపోయాడు దిల్‌రాజు. ఈ విధంగా చూసుకుంటే 'కృష్ణాష్టమి' చిత్రం సునీల్‌, వాసువర్మ, దిల్‌రాజు ముగ్గురికీ అగ్నిపరీక్షే అని చెప్పాలి.ఈ ముగ్గురు ఈ చిత్రంపై భారీ ఆశలతో ఉన్నారు. ఇందులో సునీల్‌ సరసన నిక్కీగార్లని, డింపుల్‌ చోపడే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో ఓ ఎన్నారై యువకునిగా సునీల్‌ నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రం ఫైనల్‌ కాపీని చాలా షార్ట్‌ టైమ్‌తో అంటే 2గంటల 14 నిమిషాలు.. అంటే మొత్తంగా తీసుకుంటే 134 నిమిషాల రన్‌టైంతో రానుంది. మరి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది.. అనే విషయంలో ఈ ముగ్గురు చాలా టెన్షన్‌గా ఉన్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ