Advertisementt

సలహాదారునిగా మహేష్‌..!

Sat 06th Feb 2016 10:12 PM
mahesh babu,srimanthudu,mythri movies,janathagarage  సలహాదారునిగా మహేష్‌..!
సలహాదారునిగా మహేష్‌..!
Advertisement
Ads by CJ

ప్రభాస్‌ వంటి స్టార్‌హీరో 'బాహుబలి2' తర్వాత దొరుకుతాడా? అప్పటికి ఏ స్థాయిలో క్రేజ్‌ ఉంటుందో తెలియదు. దాంతో ముందుచూపుతో మహేష్‌బాబుతో 'శ్రీమంతుడు' చేసిన మైత్రీ మూవీస్‌ అధినేతలు ప్రభాస్‌ డేట్స్‌ని లాక్‌ చేశారు. మైత్రి మూవీస్‌ అధినేతలకు, మహేష్‌బాబుకు ఉన్న అనుబంధంతో మహేష్‌ ఈ ఆలోచన ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. మైత్రి మూవీస్‌ వారు తాము చేయబోయే చిత్రాల గురించి, హీరోల డేట్స్‌ గురించి మహేష్‌తో మాట్లాడి ఆయన సలహాలు తీసుకుంటున్నారని టాక్‌. ఈ విషయంలోనూ ఇదే జరిగిందని అంటున్నారు. ఏదో ఒక హీరో అండ ఉంటేనే ఇండస్ట్రీలో పచ్చగా ఉండగలమనే విషయం మైత్రి మూవీస్‌ మేకర్స్‌కు బాగా తెలుసంటున్నారు. మైత్రి మూవీస్‌ వారు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలోనే ఎన్టీఆర్‌ హీరోగా 'జనతాగ్యారేజ్‌' చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యే సమయానికి 'బాహుబలి2' కూడా పూర్తవుతుందని, అప్పుడు ప్రభాస్‌తో ఓ సినిమా చేయాలని ప్లాన్‌ చేసి ఆయన్ను బుక్‌ చేసుకున్నారు. దర్శకుడిగా కూడా ఎవరినీ ఫైనల్‌ చేయలేదు. ప్రభాస్‌ డేట్స్‌ తీసుకొని తమ దగ్గర పెట్టుకున్నారు. ఈమేరకు ప్రభాస్‌కు భారీగానే అడ్వాన్స్‌ ఇచ్చినట్లు సమాచారం. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ