Advertisementt

తెలుగు సినిమాలకు డాలర్ల వర్షం..!

Sat 06th Feb 2016 02:02 PM
nannaku prematho,soggade chinni nayana,dictator,express raja  తెలుగు సినిమాలకు డాలర్ల వర్షం..!
తెలుగు సినిమాలకు డాలర్ల వర్షం..!
Advertisement
Ads by CJ

ఓవర్‌సీస్‌లో వసూళ్లు తెలుగు సినిమాకు చాలా కీలకంగా మారాయి. క్లాస్‌ మాస్‌ అనే తేడా లేకుండా సినిమా బాగుంటే చాలు.. అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టి, డాలర్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ జనవరి సీజన్‌లో ఓవర్‌సీస్‌ నుండి తెలుగు సినిమాలకు దాదాపుగా 30కోట్ల వసూళ్లు లభించాయి. 'నాన్నకు ప్రేమతో' చిత్రం ఓవర్‌సీస్‌లో నెంబర్‌వన్‌గా కొనసాగుతోంది. అక్కడ మూడో వారంలోనూ ఈ సినిమా జోరు చూపిస్తోంది. మొత్తానికి ఇప్పటివరకు 14కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాతి స్థానంలో 'సోగ్గాడే చిన్నినాయనా' నిలిచింది. ఈ చిత్రానికి 5.5కోట్లు రాగా, 'ఎక్స్‌ప్రెస్‌ రాజా' దాదాపు 3కోట్లు వసూలు చేసింది. ఇక 'డిక్టేటర్‌' మాత్రం కేవలం రెండు కోట్లు మాత్రమే రాబట్టింది., ఈ సినిమా ఓవర్‌సీస్‌తో పాటు ఇక్కడ కూడా 'ఎ' సెంటర్లలో కూడా చేతులెత్తేసి కేవలం బి,సి కేంద్రాలల్లోనే ఓ మోస్తరు వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ