Advertisementt

సీక్వెల్ కాదు సోగ్గాడికి కొత్త ప్రీక్వెల్?

Wed 03rd Feb 2016 01:30 PM
soggade chinni nayana,prequel,nagarjuna  సీక్వెల్ కాదు సోగ్గాడికి కొత్త ప్రీక్వెల్?
సీక్వెల్ కాదు సోగ్గాడికి కొత్త ప్రీక్వెల్?
Advertisement
Ads by CJ

రిలీజుకు ముందు హిట్టయితే పక్కా అనుకున్నారు కానీ ఇలా బంపర్ హిట్టయి నాగార్జున కెరీర్ మొత్తంలో హయ్యెస్ట్ వసూళ్లు రాబడుతుందని సోగ్గాడే చిన్ని నాయన విషయంలో ఎవరూ ఊహించి ఉండరు. నిర్మాతగా, హీరోగా నాగ్ ఈ మూవీతో ఫుల్ హ్యాపీస్. అందుకే సోగ్గాడేకి సీక్వెల్ కాదు గానీ ప్రీక్వెల్ ఒకటి తయారు చేయమని దర్శకుడు కళ్యాణ్ కృష్ణకు కొత్త పనిని పురమాయించారట. అంటే సోగ్గాడే కథలో గుడి, గుడికి సంబంధించిన బంగారు ఆభరణాల మూలం ఏమిటి అన్నది ప్రీక్వెల్ అసలు కథ అవొచ్చు.కథకి కొనసాగింపు చేస్తే సీక్వెల్ అవుతుంది, టైం స్కేల్ మీద వెనక్కి వెళితే ప్రీక్వెల్ అవుతుంది. ఇక్కడ కూడా బంగార్రాజు పాత్ర ఉంటుందా లేక వీరికి తాతలు, ముత్తాతలు అంటూ ఇంకో నాగార్జున పాత్ర ఎంట్రీ ఇస్తుందా అన్నది మరో ఆసక్తికరమైన అంశం అవుతుంది. మూలకథా రచయిత రామ్మోహన్ గారు, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తొందరలోనే ప్రీక్వెల్ పనుల్లో నిమగ్నమవుతారు. ఏదైతే ఏంటి, సోగ్గాడే కథ మీద నాగార్జునకి బాగా గురి కుదిరింది. ఇప్పట్లో వదిలేలా లేరు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ