Advertisementt


సమ్మర్‌ సినిమాలు హాట్‌కేకులు..!

Tue 02nd Feb 2016 01:41 PM
allu arjun,sarainodu,pawan kalyan,sardhar gabbar singh,brahmothsawam  సమ్మర్‌ సినిమాలు హాట్‌కేకులు..!
సమ్మర్‌ సినిమాలు హాట్‌కేకులు..!
Advertisement
Ads by CJ

స్టార్‌హీరోల చిత్రాలంటే అవి ఎలా ఉన్నా. కలెక్షన్లు దుమ్మురేపడం ఖాయమని పంపిణీదారులకు తెలుసు.దాంతో వారు స్టార్‌హీరోల చిత్రాలు మొదలయ్యాయంటే చాలు హాట్‌కేకుల్లా కొనేస్తారు. కాగా రాబోయే వేసవి కానుకగా విడుదలకు సిద్దమవుతున్న స్టార్స్‌ చిత్రాలు ఇప్పటికే ప్రీరిలీజ్‌ బిజినెస్‌ను అదరగొడుతున్నాయి. అల్లుఅర్జున్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న 'సరైనోడు' చిత్రం బిజినెస్‌ దాదాపు 70కోట్లకు చేరిందని సమాచారం. ఇక పవన్‌కళ్యాణ్‌ హీరోగా బాబి దర్శకత్వంలో రానున్న 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌' బిజినెస్‌ 100కోట్లకు చేరువయింది. పవన్‌ని నమ్ముకొని ఈ చిత్రంపై కోట్లు కుమ్మరిస్తున్నారు బయ్యర్లు. ఇక మహేష్‌బాబు నటిస్తున్న 'బ్రహ్మూెత్సవం' చిత్రం కూడా ఇప్పటివరకు మహేష్‌ కెరీర్‌లోనే హయ్యస్ట్‌ బిజినెస్‌ను చేస్తోంది. కాగా ఈచిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో కూడా పివిపి సంస్థ నిర్మిస్తోంది. దాంతో ఈ చిత్రానికి కోలీవుడ్‌ బిజినెస్‌ కూడా బోనస్‌గా రానుంది. 'శ్రీమంతుడు'తో 85కోట్లు కొల్లగొట్టిన మహేష్‌ 'బ్రహ్మూెత్సవం' ఓవర్‌సీస్‌లో 10కోట్లకు అమ్ముడైందని సమాచారం. ఇలా రాబోయే వేసవికి విడుదలకు సిద్దమవుతోన్న స్టార్‌హీరోల చిత్రాలు బిజినెస్‌పరంగా దుమ్మురేపుతున్నాయి. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ