Advertisementt

రామ్‌చరణ్‌ దృష్టి అతనిపై పడింది..!

Mon 01st Feb 2016 10:27 PM
ram charan,orange,bommarillu bhaskar,sukumar  రామ్‌చరణ్‌ దృష్టి అతనిపై పడింది..!
రామ్‌చరణ్‌ దృష్టి అతనిపై పడింది..!
Advertisement
Ads by CJ

మెగాపవర్‌స్టార్‌గా అందరూ పిలుచుకునే రామ్‌చరణ్‌ ఇప్పటివరకు కేవలం మాస్‌ అండ్‌ యాక్షన్‌ చిత్రాలతోనే ప్రేక్షకులను మెప్పించాడు. బొమ్మరిల్లు భాస్కర్‌తో చేసిన 'ఆరెంజ్‌' చిత్రంతో యూత్‌కి, క్లాస్‌ ఆడియన్స్‌కి దగ్గర కావాలని చూశాడు. కానీ ఆ చిత్రం డిజాస్టర్‌ అయింది. ఇలాంటి చిత్రాలను ఎక్కువగా ఇష్టపడే ఓవర్‌సీస్‌లో సైతం తనకు పెద్దగా క్రేజ్‌ రాకపోవడానికి క్లాస్‌ మూవీస్‌ చేయకపోవడమే తప్పు అని భావించిన చరణ్‌ త్వరలో ఆ తరహా చిత్రాన్ని చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. కాగా క్లాస్‌ ఆడియన్స్‌ను, మల్టీప్లెక్స్‌ ప్రేక్షకులను తన దర్శక ప్రతిభతో ఓ ఊపు ఉపుతోన్న సుకుమార్‌ అయితేనే తనకు క్లాస్‌ ఇమేజ్‌ రావడానికి సరైన చాయిస్‌ అని భావించిన చరణ్‌ త్వరలో సుక్కు దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనే ఆశతో ఉన్నాడు. ఇప్పటివరకు తెలుగులో ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్‌ చిత్రాలను నిర్మించిన ఓ నిర్మాత ఈ ఇద్దరి కాంబినేషన్‌ను సెట్‌ చేయడానికి పావులు కదుపుతున్నాడు. మరి ఈ చిత్రం ఎప్పుడు మెటీరియలైజ్‌ అవుతుందో వేచిచూడాల్సివుంది..! 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ