Advertisementt

రాజమౌళి శిష్యుడికి భంగపాటు!

Mon 01st Feb 2016 05:53 PM
lachchimdeviki o lekkundi,lavanya tripati,jagadish talasila  రాజమౌళి శిష్యుడికి భంగపాటు!
రాజమౌళి శిష్యుడికి భంగపాటు!
Advertisement
Ads by CJ

రాజమౌళి ఓటమి ఎరుగని దిగ్దర్శకుడు అయినంత మాత్రాన, అతని స్కూలు నుండి వచ్చే విద్యార్థులు కూడా మరో రాజమౌళి అవుతారు అనుకోవడం సరికాదు. లచ్చిందేవికి ఓ లెక్కుంది అన్న సినిమాకు దర్శకత్వం వహించిన జగదీష్ తలశిల, ఖచ్చితంగా రాజమౌళి శిష్యరికం బ్రాండుని వీలైనంతగా వాడుకునే ప్రయత్నం చేసారు. కానీ మూవీ బాగుంటే, జనానికి ఏ కేరాఫ్ అడ్రస్ అవసరం లేదు ఎందుకంటే సినిమానే అన్నింటికీ, అందరికీ చిరునామాగా మారుతుంది. దురదృష్టవశాత్తు, లచ్చిందేవి లెక్క తప్పి తన సినిమాకే కటాక్షం చూపలేక పోయింది. లావణ్య త్రిపాటి, నవీన్ చంద్ర, జయప్రకాశ్ రెడ్డి ముఖ్య తారాగణంగా వచ్చిన లచ్చిందేవికి ఓ లెక్కుంది చిత్రం పోయిన వారం విడుదలయిన అన్నింటిలోకెల్లా వీకెస్ట్ అంటున్నారు జనాలు. మొదటి నుండి, ట్రైలర్ విడుదలైన తరువాతా, ఈ మూవీ పట్ల కొంత అనుకూల పవనాలు వీచినా చివరాఖరుకి బాక్సాఫీస్ దగ్గర మాత్రం బొక్కబోర్లా పడింది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ