Advertisementt

క్రియేటివిటీని వదిలేసిన టాలెంటెడ్‌ డైరెక్టర్‌!

Mon 01st Feb 2016 12:27 PM
sekhar kammula,anand,happy days,happy days remake,talented director  క్రియేటివిటీని వదిలేసిన టాలెంటెడ్‌ డైరెక్టర్‌!
క్రియేటివిటీని వదిలేసిన టాలెంటెడ్‌ డైరెక్టర్‌!
Advertisement
Ads by CJ

'ఆనంద్‌' చిత్రంతో అందరికీ మంచి కాఫీ లాంటి సినిమా అందించి ఆ తర్వాత 'గోదావరి, హ్యాపీడేస్‌' వంటి చిత్రాలతో తన క్రియేటివిటీని చూపించి ఓ ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచి తన క్రియేటివిటీతో అందరినీ ఆకట్టుకున్నాడు శేఖర్‌కమ్ముల. కాగా ఆయన తీసిన 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' చిత్రం కాస్త నిరాశ పరచడంతో ఆయన తన పంధా మార్చాడు. క్రియేటివిటీని పక్కనపెట్టి రీమేక్‌లపై కన్నేశాడు. బాలీవుడ్‌లో హిట్టైన 'కహాని' చిత్రానికి రీమేక్‌గా నయనతారతో ఆయన 'అనామిక' చిత్రం చేశాడు. ఈ రీమేక్‌ డిజాస్టర్‌గానే నిలిచింది. ఆయన మరోసారి తన 'హ్యాపీడేస్‌'నే నమ్ముకొని బాలీవుడ్‌లో అందరూ కొత్త నటీనటులతో 'హ్యాపీడేస్‌'ను రీమేక్‌ చేస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని సల్మాన్‌ఖాన్‌తో కలిసి శేఖర్‌కమ్ముల నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం హిట్టయితేనే శేఖర్‌కమ్ముల భవిష్యత్తు ఉంటుంది. బాలీవుడ్‌లోనే కాదు.. టాలీవుడ్‌లో సైతం ఆయనకు మరిన్ని అవకాశాలు వస్తాయి. అంతేకాదు.. ఈ చిత్రం ఫలితంపైనే మహేష్‌బాబుతో చేసే చిత్రం పట్టాలెక్కుతుంది. లేకపోతే ఈ క్రియేటివ్‌ డైరెక్టర్‌కు తిప్పలు తప్పవు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ