Advertisementt

అల్లు అర్జున్ ఆరాటం దేనికోసం!!

Sun 31st Jan 2016 11:43 PM
allu arjun,bunny,sarrainodu,3 set for sarrainodu song,manam vikram kumar  అల్లు అర్జున్ ఆరాటం దేనికోసం!!
అల్లు అర్జున్ ఆరాటం దేనికోసం!!
Advertisement
Ads by CJ

'స‌రైనోడు' కోసం బ‌న్నీ తెగ క‌ష్ట‌ప‌డుతున్నాడు. రాబోయే స‌మ్మ‌ర్ సీజ‌న్‌ని త‌న చిత్రంతోనే ఆరంభించాల‌ని ఆయ‌న గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. ఏప్రిల్ వ‌స్తే త‌న సోలో సినిమా స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి వ‌చ్చి కూడా  యేడాది అవుతుంది. అందుకే ఆలోపుగానే స‌రైనోడుని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని బ‌న్నీ రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతున్నాడు. ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ స్టూడియోలో ఓ పాట చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఆ పాట‌కోసం భారీస్థాయిలో మూడు సెట్ల‌ను తీర్చిదిద్దిన‌ట్టు తెలుస్తోంది. ఒకొక్క సెట్టు ఒక్కో స్టైల్‌లో అదిరిపోయేలా ఉంద‌ట‌. మాంచి ఊపొచ్చే పాట‌ని అక్క‌డ చిత్రీక‌రిస్తున్నార‌ట‌. అందులో బ‌న్నీతోపాటు క‌థానాయిక ర‌కుల్‌ప్రీత్‌సింగ్ ఆడిపాడుతోంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాపై బ‌న్నీ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఇటీవ‌లే ఫ‌స్ట్‌లుక్‌ని విడుద‌ల చేశారు. 

స‌రైనోడు త‌ర్వాత బ‌న్నీ చాలా సినిమాల్ని లైన్లో పెట్టాడు. మొట్ట మొద‌ట మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ సినిమా మొద‌ల‌వుతుంది. అది టెక్నిక‌ల్ స్టాండ‌ర్డ్స్‌తో తెర‌కెక్క‌నున్న సినిమా అని తెలిసింది. ఆ చిత్రాన్ని తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ... ఇలా అన్ని భాష‌ల‌కీ పంపాల‌న్న ఆలోచ‌న‌తో చిత్ర‌బృందం ఉంద‌ట‌. యూనివ‌ర్స‌ల్ పాయింట్‌తో తెర‌కెక్క‌నున్న సినిమా కావ‌డ‌మే అందుకు కార‌ణం.  ఆ చిత్రంపై చాలా ఆసక్తిగా ఉన్న బ‌న్నీ స‌రైనోడుని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని క‌ష్ట‌ప‌డుతున్నాడు. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ