Advertisement

కామెడీ పోలీస్‌గా వెంకీ..!

Sat 30th Jan 2016 07:30 PM
venkatesh,maruthi,overseas,comedy police officer role  కామెడీ పోలీస్‌గా వెంకీ..!
కామెడీ పోలీస్‌గా వెంకీ..!
Advertisement

ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌-నయనతార జంటగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సైలెంట్‌గా, స్పీడ్‌గా షూటింగ్‌ జరుపుకుంటోంది. డిసెంబర్‌ చివరి వారం నుండి మొదలైన రెగ్యులర్‌ షూటింగ్‌ నాన్‌స్టాప్‌గా జరుగుతోంది. కాగా ఈ చిత్రానికి ఇప్పటినుండే బిజినెస్‌ ఎంక్వైరీలు మొదలయ్యాయి. వెంకీకి ఉన్న ఫ్యామిలీ సెంటిమెంట్‌, మారుతికి ఉన్న 'భలే భలే మగాడివోయ్‌' క్రేజ్‌ దృష్ట్యా ఈ చిత్రానికి ఓవర్‌సీస్‌లో మంచి అంచనాలే ఉన్నాయి. కాగా ఈ చిత్రం ఓవర్‌సీస్‌ బిజినెస్‌ క్లోజ్‌ అయిందని సమాచారం. బ్లూస్కై వారు ఈ సినిమా ఓవర్‌సీస్‌ రైట్స్‌ను 2.5కోట్లకు కొన్నారు. ఈ సినిమాలో వెంకీది ఓ గమ్మతైన పాత్ర అని సమాచారం. ఇందులో ఆయన ఓ కామెడీ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రను పోషిస్తుండగా, నయనతార ఓ అమాయకపు బ్రాహ్మణ యువతిగా నటిస్తోంది. గిబ్రాన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement