Advertisementt

కృష్ణ‌వంశీ 'రుద్రాక్ష' ఎవరో తెలుసా?

Fri 29th Jan 2016 04:00 PM
krishna vamsi,rudraksha,samantha,anushka,samantha in krishna vamsi rudraksha  కృష్ణ‌వంశీ 'రుద్రాక్ష' ఎవరో తెలుసా?
కృష్ణ‌వంశీ 'రుద్రాక్ష' ఎవరో తెలుసా?
Advertisement
Ads by CJ

లేడీ ఓరియెంటెడ్ సినిమాకి రంగం సిద్ధం చేసుకున్నాడు కృష్ణ‌వంశీ. ఆ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించ‌బోతున్నాడు. ఓ కుటుంబ క‌థ‌తో తెర‌కెక్క‌బోతున్న ఆ చిత్రంలో అనుష్క న‌టిస్తుంద‌ని ప్ర‌చారం సాగింది. అయితే ఇప్పుడు ఆ స్థానంలో స‌మంత‌ని ఫిక్స్ చేసిన‌ట్టు తెలిసింది. త్వ‌ర‌లోనే చిత్రానికి కొబ్బ‌రికాయ కొట్ట‌బోతున్నారు. గోవిందుడు అంద‌రివాడేలే త‌ర్వాత కృష్ణ‌వంశీ మ‌రో సినిమా చేయ‌లేదు. అప్ప‌ట్నుంచి స్క్రిప్టుపైనే కూర్చున్నాడు. మొద‌ట్లో ముగ్గురు క‌థానాయ‌కుల‌తో ఓ సినిమా చేయాల‌ని  క‌థ త‌యారు చేసుకొన్నాడు. అయితే క‌థానాయ‌కుల కాల్షీట్ల స‌మ‌స్య ఉండ‌టంతో ఆ క‌థ‌ని ప‌క్క‌న‌బెట్టి 'రుద్రాక్ష' స్క్రిప్టుని త‌యారు చేసుకొన్నాడు. 

అయితే మొద‌ట్నుంచీ ఆ క‌థ‌లో అనుష్క‌నే ఊహిస్తూ వ‌చ్చారు కృష్ణ‌వంశీ.  అనుష్క కూడా చేయ‌డానికి సంసిద్ధ‌త వ్య‌క్తం చేసింది. కానీ  కాల్షీట్లు పెద్ద‌యెత్తున అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని చెప్ప‌డంతో  అనుష్క చేతులెత్తేసింద‌ట‌. ప్ర‌స్తుతం ఆమె బాహుబ‌లి2తోపాటు, సింగం 3, భాగ్‌మ‌తి  చిత్రాలకి సంబంధించిన ప‌నుల్లో ఉంది. దీంతో చిత్ర‌బృందం ఆమెకి బ‌దులుగా స‌మంత‌ని ఎంపిక చేసుకొన్నార‌ట‌. కృష్ణ‌వంశీ సినిమా కావ‌డంతో స‌మంత కూడా ఏమాత్రం ఆలోచించ‌కుండా సినిమాకి కాల్షీట్లు కేటాయించేందుకు ఒప్పుకున్న‌ట్టు స‌మాచారం. త్వ‌రలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశాలున్నాయి. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ