Advertisementt

అనిరుద్‌కు బంపర్‌ఆఫర్‌..!

Fri 29th Jan 2016 09:26 AM
anirudh,pawan kalyan,kushi,renu desai,s.j.surya  అనిరుద్‌కు బంపర్‌ఆఫర్‌..!
అనిరుద్‌కు బంపర్‌ఆఫర్‌..!
Advertisement
Ads by CJ

పవన్‌కళ్యాణ్‌ ఎప్పుడు ఎవరితో సినిమా చేస్తాడో ఎవ్వరికీ అంతుపట్టదు. ఆయన తాజాగా తమిళ దర్శకుడు , నటుడు ఎస్‌.జె.సూర్యతో ఓ సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం దాదాపుగా కన్‌ఫర్మ్‌ అయిందని సమాచారం. కాగా సూర్య పవన్‌కు 'ఖుషీ' వంటి బ్లాక్‌బస్టర్‌ ఇచ్చి ఉండవచ్చు. కానీ ఆయన ఆ తర్వాత పవన్‌తో చేసిన 'కొమరం పులి' ఎంతటి డిజాస్టరో అందరికి తెలిసిందే. దీంతో పవన్‌ అభిమానుల్లో సూర్య పేరు వినగానే ఓ రకమైన భయాందోళనలు రేకెత్తుతున్నాయి. ఈ చిత్రానికి పవన్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌ సహనిర్మాతగా వ్యవహరించనుంది. ఈ చిత్రానికి తమిళంలో సంచలనాలు సృష్టిస్తున్న సంగీత కెరటం అనిరుధ్‌ రవిచంద్రన్‌ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ విషయంలో ఇప్పటికే సూర్య అనిరుద్‌తో చర్చలు జరిపినట్లు కోలీవుడ్‌ సమాచారం. తాజాగా ఆయనకు త్రివిక్రమ్‌ తీస్తున్న 'అ..ఆ' చిత్రానికి సంగీత దర్శకునిగా పనిచేసే అవకాశం వచ్చింది. కానీ చేజేతులా అనిరుద్‌ ఈ చాన్స్‌ను మిస్‌ చేసుకున్నాడు. పోనీ 'అ..ఆ' పోయినప్పటికీ పవన్‌కళ్యాణ్‌ వంటి స్టార్‌హీరో నటించే చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం అనిరుద్‌కు లభించడం అదృష్టమే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ