Advertisementt

నితిన్‌ రేంజ్‌ను త్రివిక్రమ్‌ పెంచాడా? లేక..!

Wed 27th Jan 2016 10:50 PM
nithin,a aa movie,trivikram srinivas,nithiin range,a aa movie budget  నితిన్‌ రేంజ్‌ను త్రివిక్రమ్‌ పెంచాడా? లేక..!
నితిన్‌ రేంజ్‌ను త్రివిక్రమ్‌ పెంచాడా? లేక..!
Advertisement
Ads by CJ

వాస్తవానికి రాజమౌళి, వినాయక్‌, పూరీజగన్నాథ్‌ తదితర టాప్‌ డైరెక్టర్స్‌ అందరితో పనిచేసిన నితిన్‌ మార్కెట్‌ ఇప్పటికీ కేవలం 25కోట్లు దాటలేదు. కానీ త్రివిక్రమ్‌ పుణ్యమా అని నితిన్‌ మార్కెట్‌ 35కోట్లకు పెరుగుతోంది. నితిన్‌తో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో సినిమా అనగానే అందరూ అది లో బడ్జెట్‌ సినిమా అయివుంటుందని భావించారు. కానీ పోను పోను ఈ చిత్రం బడ్జెట్‌ భారీగా పెరిగిపోయింది. ఈ చిత్రం ప్రీరిలీజ్‌ బిజినెస్‌ కూడా అదే స్థాయిలో ఉందని సమాచారం. ఈ చిత్రంతో నితిన్‌ రేంజ్‌ను పెంచేస్తున్నాడు త్రివిక్రమ్‌. ఆయన చలవతో 'అ..ఆ' మార్కెట్‌ 35కోట్లకు పెరిగిందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. మరి 'అ..ఆ' చిత్రం విడుదలైన తర్వాత ఆ స్థాయిలో లాభాలు కూడా వస్తాయా? రావా? నితిన్‌ రేంజ్‌ను త్రివిక్రమ్‌ పెంచాడా? లేక నిర్మాత చేత అంత బడ్జెట్‌ పెట్టించి త్రివిక్రమ్‌ తప్పు చేశాడా? అనేది తేలనుంది. కాగా ఈ చిత్రంలో నితిన్‌తో పాటు సమంత, అనుపమ పరమేశ్వరన్‌, నదియా వంటి బిజీ ఆర్టిస్ట్‌లు నటిస్తుండటం కూడా బడ్జెట్‌ పెరగడానికి మరో కారణం అంటున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ