Advertisementt


తనది తప్పుకాదంటోన్న సుక్కు..!

Tue 26th Jan 2016 09:14 PM
sukumar,nannaku prematho,ntr,balakrishna,dictator  తనది తప్పుకాదంటోన్న సుక్కు..!
తనది తప్పుకాదంటోన్న సుక్కు..!
Advertisement
Ads by CJ

'నాన్నకు ప్రేమతో' చిత్రం పూర్తిస్థాయి క్లాస్‌ చిత్రంగా టాక్‌ తెచ్చుకుంది. దానికి అనుగుణంగానే ఈ చిత్రం 'ఎ' క్లాస్‌ సెంటర్స్‌లో, మల్టీప్లెక్స్‌ ఆడియన్స్‌ను మరీ ముఖ్యంగా ఓవర్‌సీస్‌లో అద్భుతమైన కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటికే ఈ చిత్రం యూఎస్‌లో 'బాహుబలి, శ్రీమంతుడు' తర్వాతి స్థానంలో ఉంది. అంటే ఈ చిత్రం 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని సైతం క్రాస్‌ చేసిందని ట్రేడ్‌వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో అక్కడక్కడ క్లారిటీ మిస్‌ అయిందని విమర్శకులు, రివ్యూలు... ఈ పాయింట్‌ను తప్పుపడుతూ పలు విమర్శలు చేశాయి. దీనిపై మొదటి సారిగా సుక్కు నోరు విప్పాడు. ఆయన మాట్లాడుతూ... చాలా సీన్లు లాజిక్‌తోనే రాసుకొన్నాను. ఇంకొంచెం వివరంగా చెబితే బాగుండేది. అయితే అందుకు తగిన సమయం దొరకలేదు. మధ్య మధ్యలో కొన్నిచోట్ల లింకులు మిస్సయ్యాయి. లేదంటే ఏ సీన్‌పై ఎవ్వరికీ అనుమానాలు వచ్చుండేది కాదు... అంటున్నాడు. మొత్తానికి సుక్కు ఇన్‌డైరెక్ట్‌గా విషయాన్ని చెప్పేశాడు. ఎన్టీఆర్‌ ఈ చిత్రాన్ని ఎలాగైన సంక్రాంతికి 'డిక్టేటర్‌'కు పోటీగా విడుదల చేయాలనే ఉద్ధేశ్యంతో హడావుడి చేయడం వల్లే ఈ పొరపాట్లు జరిగాయని విశ్లేషకులు అంటున్నారు. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ