హే... త్రిష ఒలకబోసింది!

Tue 26th Jan 2016 06:46 PM
trisha,kalavathi,sundar c  హే... త్రిష ఒలకబోసింది!
హే... త్రిష ఒలకబోసింది!
Sponsored links

సహజంగా దర్శకుడు సుందర్ C సినిమాలు గ్లామర్ మోతాదును సరిగ్గా పాటిస్తాయి. బ్యాక్ డ్రాప్ ఏదైనా తమిళ, తెలుగు ఆడియెన్సు అభిరుచిని దృష్టిలో పెట్టుకునే ఆయన సినిమాలు తీస్తారు. ఇప్పుడొస్తున్న కళావతిలో కూడా హీరోయిన్ త్రిష గ్లామరసం వాడుకోవడం వెనకాల సుందర్ సీనియారిటీ కనపడుతోంది. చెప్పుకోవడానికి ఇది హారర్ కామెడీ చిత్రం అయినా హీరో సిద్దార్థ్, హీరోయిన్ త్రిషల మీద తీసిన రొమాంటిక్ ట్రాక్ వెచ్చవెచ్చగా ఉండనుంది. దీనికంటే ముందు వచ్చిన చంద్రకళలో కూడా ఆండ్రియా, రాయ్ లక్ష్మిల చేత చెడుగుడు ఆడేసాడు. ఇక ఈసారి త్రిష, పూనం భాజ్వాలా వంతు. త్రిష కూడా అవకాశాల కోసం వెతుక్కుంటున్న ఈ తరుణంలో, వయసు పెరిగినా తన వలపులో ఇంకా వన్నె తగ్గలేదు అని నిరూపించుకోవడం కోసమైనా కాస్తంత ఎక్కువ చూపించుకోవడానికి ప్రయత్నం చేసిందట. అందుకే ఈ అందాల ఒలకబోత. రేపు 29కి థియేటర్లలోకి వస్తే మరింత వేడిగా వడ్డిస్తారు సుందర్.

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019