Advertisementt

సోగ్గాడే అలలు లక్ష్మీదేవిని తాకుతాయా?

Mon 25th Jan 2016 04:10 PM
lacchimdeviki o lekkundi,lavanya tripathi  సోగ్గాడే అలలు లక్ష్మీదేవిని తాకుతాయా?
సోగ్గాడే అలలు లక్ష్మీదేవిని తాకుతాయా?
Advertisement
Ads by CJ

సోగ్గాడే చిన్ని నాయన సూపర్ సక్సెస్ అవడంతో హీరోయిన్ లావణ్య త్రిపాఠి క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఇంతకుమునుపు అందాల రాక్షసి, దూసుకెల్తా, మనం, భలే భలే మగాడివోయ్ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించడంతో పాటుగా ఇప్పుడు సోగ్గాడే కూడా బంపర్ హిట్ కావడం లావణ్య కెరీరుకు శుభసూచకం. అందుకే కాబోలు సోగ్గాడే ఇచ్చిన బూస్టును ఉపయోగించుకునే పనిలో పడ్డారు లావణ్య తదుపరి సినిమా లచ్చిందేవికి ఓ లెక్కుంది దర్శకనిర్మాతలు. గతకొద్ది రోజులుగా సరైన రిలీజ్ టైం కోసం వెయిట్ చేసినందుకు వారికి ఇప్పుడు సోగ్గాడేతో లావణ్యకు లభించిన మైలేజ్ నిజంగానే లచ్చిందేవికి కొత్త లక్కును తెచ్చిపెట్టనుంది. నవీన్ చంద్ర, బ్రహ్మాజీ, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ కామెడీ థ్రిల్లర్ చిత్రంలో లావణ్యను దెయ్యంగా చూపిన ట్రైలర్ భాగం జనాన్ని బాగా ఆకట్టుకుంది. ఈ చిత్ర దర్శకుడు జగదీష్ తలసిల గారు రాజమౌళి శిష్యుడు కావడం మరో ప్లస్ పాయింట్. ఈ వారం రిలీజవుతున్న లచ్చిందేవి లెక్క ఏంటో తేలాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే. ఇక ఈ సినిమా కూడా హిట్టయితే లావణ్యకు తిరుగుండదు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ