Advertisementt


దర్శకులను మాయ చేస్తోన్న స్టార్స్‌...!

Mon 25th Jan 2016 07:36 AM
nagarjuna,kalyan krishna,varun tej,krish,koratala shiva  దర్శకులను మాయ చేస్తోన్న స్టార్స్‌...!
దర్శకులను మాయ చేస్తోన్న స్టార్స్‌...!
Advertisement
Ads by CJ

నేటి రోజుల్లో ఒక సినిమా మంచి హిట్టు అయితే ఇక ఆ డైరెక్టర్‌ ఎవ్వరికి చిక్కనంత బిజీగా మారిపోతున్నారు. అసలే హిట్‌ చిత్రాల దర్శకులు చాలా అరుదుగా వస్తుండంతో ఆయా డైరెక్టర్లను హీరోలు, నిర్మాతలు వదలడం లేదు. ఒక సినిమా చేస్తున్నప్పుడే తదుపరి చిత్రానికి కూడా వారినే డైరెక్ట్‌ చేయమని కోరి వారికి ముందస్తు జాగ్రత్తగా అడ్వాన్స్‌ చేతిలో పెట్టి తమకే కట్టుబడేలా చేస్తున్నారు. దీంతో రిపీట్‌ కాంబినేషన్స్‌ బాగా ఎక్కువవుతున్నాయి. చాలారోజులకు గాను హీరో రామ్‌కు 'నేను..శైలజ'తో హిట్టు ఇచ్చిన దర్శకుడు కిషోర్‌ తిరుమల. కాగా ఆ డైరెక్టర్‌తోనే మరలా రామ్‌ తన తదుపరి చిత్రం కూడా చేయనున్నాడు. ఆల్‌రెడీ అడ్వాన్స్‌ కూడా ఇచ్చేశాడు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీపొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఇక నాగార్జునకు 'సోగ్గాడే చిన్నినాయనా'తో అద్భుతమైన హిట్‌ ఇచ్చిన కొత్త దర్శకుడు కళ్యాణ్‌కృష్ణను తదుపరి చిత్రం కూడా తమ అన్నపూర్ణ బేనర్‌లోనే చేయాలని నాగ్‌ పట్టుబడుతున్నాడు. మరి ఈ చిత్రం అఖిల్‌తోనా, లేక నాగచైతన్యతోనా అనేది మాత్రం సస్పెన్స్‌గా ఉంది. ఇక మెగాహీరో వరుణ్‌తేజ్‌తో దర్శకుడు క్రిష్‌ చేసిన 'కంచె' చిత్రం మంచి పేరును తెచ్చిపెట్టడంతో క్రిష్‌ దర్శకత్వంలోనే వరుణ్‌తేజ్‌ 'రాయబారి' సినిమా చేయబోతున్నాడు. ఇక నిర్మాతల విషయానికి వస్తే తాము మొదటిసారిగా మహేష్‌బాబు-కొరటాల శివల దర్శకత్వంలో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను అందుకున్న 'శ్రీమంతుడు' చిత్ర నిర్మాతలు తమ తదుపరి ఎన్టీఆర్‌తో చేసే 'జనతాగ్యారేజ్‌' చిత్రానికి సైతం కొరటాలనే నమ్ముకున్నారు. ఈ విషయంలో మైత్రిమూవీస్‌ అధినేతలు సరైన నిర్ణయం తీసుకున్నారని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ