Advertisementt

సుకుమార్‌ దర్శకత్వానికి గుడ్‌బై చెబుతాడా..?

Sat 23rd Jan 2016 05:45 PM
sukumar,nannaku prematho,one nenokkadine movie  సుకుమార్‌ దర్శకత్వానికి గుడ్‌బై చెబుతాడా..?
సుకుమార్‌ దర్శకత్వానికి గుడ్‌బై చెబుతాడా..?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం టాలీవుడ్‌ టాప్‌ లీగ్‌లో కొనసాగుతున్న దర్శకుల్లో సుకుమార్‌ ఒకడు. రొటీన్‌ సినిమాలకు భిన్నంగా ఇంటెలిజెంట్‌ కాన్సెప్ట్‌లతో సినిమాలు తీయడం ఆయన ప్రత్యేకత. అందుకే స్టార్‌హీరోలు సుకుమార్‌ చిత్రాల్లో నటించడానికి ఉవ్విళ్లూరుతుంటారు. అయితే మరో రెండు మూడు సినిమాల తర్వాత సుకుమార్‌ ఇక దర్శకత్వానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మాట అన్నాడట. ఈ ఇంటర్వ్యూ ఎప్పుడు ఏ చానెల్‌లో ప్రసారమవుతుందనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. మరి ఆయన నోటి నుండి ఈ మాట ఎందుకు వచ్చింది? అనేది పూర్తి ఇంటర్వ్యూ రిలీజ్‌ అయిన తర్వాత తేలనుంది. గతంలోనూ '1' (నేనొక్కడినే) సినిమా సమయంలో లైవ్‌షోలో కూడా సుకుమార్‌ మాట్లాడుతూ.. కాస్త అసహనానికి గురయిన సంగతి తెలిసిందే. తన సినిమాలు అర్థం చేసుకునే మెచ్యూరిటీ లేని వారు తన సినిమాలు చూడొద్దనే విధంగా ఆయన వాదించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ఆయన చేసిన 'నాన్నకు ప్రేమతో' చిత్రం మంచి వసూళ్లు సాధిస్తున్నప్పటికీ కొందరికి ఈ సినిమా అర్ధం కాలేదనే వాదన కూడా ఉంది. ఈ క్రమంలోనే సుకుమార్‌ దర్శక్వం వహించడం మానేస్తాను అనే విధంగా మాట్లాడాడని తెలుస్తోంది. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ