Advertisementt

బాలయ్య మాట ఇస్తే అంతేమరి!

Fri 22nd Jan 2016 10:19 PM
dictator,anjali,balayya 100th movie,singeetham srinivasa rao,aditya 999  బాలయ్య మాట ఇస్తే అంతేమరి!
బాలయ్య మాట ఇస్తే అంతేమరి!
Advertisement
Ads by CJ

తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి నటిగా పేరుతెచ్చుకుంటున్న తెలుగమ్మాయి అంజలి. ఆమె ఇటీవలే బాలకృష్ణ సరసన 'డిక్టేటర్‌' చిత్రంలో నటించింది. నేటితరం హీరోయిన్లు సీనియర్‌ స్టార్స్‌తో కలిసి నటించడానికి విముఖత చూపుతున్న తరుణంలో వెంకటేష్‌, బాలకృష్ణ వంటి సీనియర్‌ స్టార్స్‌ చిత్రాల్లో నటించడానికి ఒప్పుకొని కొంత ధైర్యమే చేసింది ఈ అమ్మడు. ఇప్పుడు అదే ఆమెకు మంచి ఛాన్స్ లు లభించడానికి కారణం అవుతోంది. 'డిక్టేటర్‌' షూటింగ్‌ సమయంలో అంజలి నటనాపటిమ, క్రమశిక్షణ చూసి తెగముచ్చట పడిన బాలకృష్ణ ఆమెను ఏకంగా సావిత్రితో పోలుస్తూ కితాబు ఇచ్చాడు. తాజాగా ఆయన అదే సినిమా షూటింగ్‌లోనే తన వందో చిత్రంలో కూడా నీకు అవకాశం ఇస్తాను అని అంజలికి మాట ఇచ్చాడట. బాలయ్య మాటంటే మాటే కాబట్టి ఆయన 100వ చిత్రంలో ఆమెను ఓ హీరోయిన్‌గా తీసుకోవాలని బాలయ్య డిసైడ్‌ అయినట్లు నందమూరి కాంపౌండ్‌ వర్గాలు అంటున్నాయి. దాదాపుగా బాలయ్య 100వ చిత్రం 'ఆదిత్య 999' అయ్యే అవకాశాలే ఉండటంతో ఓ హీరోయిన్‌గా అంజలి పేరును ఆయన సింగీతం శ్రీనివాసరావుకు ఇప్పటికే సూచించాడని కూడా తెలుస్తోంది. మొత్తానికి అంజలి ధైర్యానికి ఇది ఆమెకు లభించిన గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ