యండమూరికి ఇప్పుడు ఏమొచ్చింది!

Wed 20th Jan 2016 02:35 PM
yandamuri veerendranath,ramcharan comments,chiranjeevi,devi sri prasad  యండమూరికి ఇప్పుడు ఏమొచ్చింది!
యండమూరికి ఇప్పుడు ఏమొచ్చింది!
Sponsored links

యండమూరి వీరేంద్రనాథ్ గారు ప్రఖ్యాత నవలా రచయితగానే కాక ఎన్నో హిట్ సినిమాలకు కథ, కథనం అందించినవారిగా కూడా గుర్తింపు పొందారు. మరీ ముఖ్యంగా చిరంజీవిగారితో యండమూరి కలయికకు సాక్ష్యంగా ఎన్నో హిట్ చిత్రాలు నిలిచాయి. అలాగే యండమూరికి చిరంజీవి కుటుంబంతో కూడా దగ్గరి సాన్నిహిత్యం ఉంది. మరి ఇద్దరి మధ్యా ఏమయిందో తెలియదుగానీ ఇలా చిరంజీవి గారబ్బాయి రామ్ చరణ్ పట్ల యండమూరి విసరిన మాటల తూటాలు అభిమానుల్లో కలకలం రేపాయి. ఒక వ్యక్తి యొక్క  ఐడెంటిటీ అతడు పడే కష్టాన్నిబట్టి ఉండాలి గానీ తండ్రి సాధించిన పేరు ప్రఖ్యాతల మీద ఉండకూడదు అని, తన ప్రకారం సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అసలైన హీరో అని రామ్ చరణ్ కాదని తలంపుకు వచ్చేలా యండమూరి గారు ఓ కార్యక్రమంలో మాట్లాడారు. అంతే కాకుండా హీరో అవడానికి ముందు రామ్ చరణ్ తన మొహానికి సర్జరీ కూడా చేయించుకున్నాడని సెలవిచ్చారు. అసందర్భోచితంగా యండమూరి చేసిన ఈ కామెంట్స్ వెనక ఇంకా ఏదైనా అర్థం దాగి ఉందంటారా? 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019