Advertisementt

చిరు 150వ సినిమాకు డేట్‌ ఫిక్స్‌ అయింది..!

Wed 20th Jan 2016 09:32 AM
chiranjeevi,150th film,katthi remake,vinayak,nayanathara  చిరు 150వ సినిమాకు డేట్‌ ఫిక్స్‌ అయింది..!
చిరు 150వ సినిమాకు డేట్‌ ఫిక్స్‌ అయింది..!
Advertisement
Ads by CJ

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించే 150వ చిత్రం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని మెగాభిమానులతో పాటు సామాన్య సినీ ప్రేమికులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తమిళంలో విజయ్‌-మురుగదాస్‌ల కాంబినేషన్‌లో సూపర్‌హిట్టు అయిన 'కత్తి'కి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం ముహూర్తం కూడా ఫిక్స్‌ అయింది. మార్చి 27న మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్బంగా ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. కాగా ఇందులో చిరు సరసన హీరోయిన్‌గా నయనతారను, విలన్‌గా బాలీవుడ్‌ నటుడు వివేక్‌ఒబేరాయ్‌ను ఎంపిక చేసుకున్నారు. ఇంతకు ముందు వినాయక్‌-చిరంజీవిల కాంబినేషన్‌లో వచ్చిన రీమేక్‌ 'ఠాగూర్‌' దారిలోనే ఈ తాజా చిత్రం కూడా ఘనవిజయం సాధిస్తుందని మెగాభిమానులు ఆశతో ఉన్నారు. మరి ఈ సారి ఈ కాంబినేషన్‌ ఎలాంటి సంచలనాలకు తెరలేపనుందో వేచిచూడాలి...! 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ