Advertisementt

అనుష్కకు తగిన వాడు దొరకలేదంట!

Sun 17th Jan 2016 12:26 PM
anushka,anushka marriage,bahubali 2,devasena,s3 movie,anushka about marriage  అనుష్కకు తగిన వాడు దొరకలేదంట!
అనుష్కకు తగిన వాడు దొరకలేదంట!
Advertisement
Ads by CJ

సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క పెళ్లి విషయంలో నిర్ణయానికి వచ్చేసింది. ప్రస్తుతం ఆమె వయసు 34ఏళ్లు. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిల్‌ అవ్వాలని ఆమె ఆలోచనగా ఉంది. ఈ విషయమై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది ఈ స్వీటీ. నేను ఎక్కడికి వెళ్లినా అంతా నా పెళ్లి గురించే అడుగుతున్నారు. ఈ విషయమై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలని నాకు కూడా ఉంది. కానీ ఇప్పటి వరకు నాకు తగిన వాడు దొరకలేదు. నాకు తగిన వాడు, నన్ను ఇంప్రెస్‌ చేసే వాడు దొరికితే వెంటనే పెళ్లి చేసుకుంటాను... అంటూ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం అనుష్క తన సినిమాల షూటింగ్‌ల్లో బిజీగా ఉంది. ఆమె సూర్య హీరోగా హరి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎస్‌3' చిత్రంలో సూర్యకు భార్యగా నటిస్తోంది. ఇక ఆ వెంటనే ఆమె 'బాహుబలిపార్ట్‌ 2'తో బిజీ కానుంది. 'బాహుబలి' సెకండ్‌ పార్ట్‌లో అనుష్క పాత్ర పూర్తిస్థాయిలో ఉంటుందని, రాణి దేవసేనగా ఆమె పుల్‌లెంగ్త్‌ రోల్‌లో కనిపించనుందని తెలుస్తుంది. దీంతో 'బాహుబలి 2' తర్వాత అనుష్క పెళ్లి పీటలు ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ