కేసు వేసింది.. పవన్ ఒక్కడే కాదు!

Thu 14th Jan 2016 09:05 PM
pawan kalyan,trivikram srinivas,bvsn prasad,attarintiki daaredi,case,maa  కేసు వేసింది.. పవన్ ఒక్కడే కాదు!
కేసు వేసింది.. పవన్ ఒక్కడే కాదు!
Advertisement
Ads by CJ

ఎవ్వరూ ఊహించని విధంగా 'నాన్నకు ప్రేమతో' నిర్మాత బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌పై పవన్‌కళ్యాణ్‌ కంప్లైంట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలకు ముందే 'అత్తారింటికి దారేది' చిత్రం పైరసీ కావడంతో ఈ చిత్ర నిర్మాత రిలీజ్‌ విషయంలో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో పవన్‌ తన రెమ్యూనరేషన్‌లో రెండు కోట్లు తర్వాత ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకొని నిర్మాతకు హెల్ప్ చేశాడు. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషన్‌ సృష్టించడంతో పాటు అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. మరి అంత మంచి మనసుతో రెండు కోట్లు తర్వాత ఇవ్వవచ్చని నిర్మాతకు ధైర్యం చెప్పిన పవన్‌ మంచితనాన్ని నిర్మాత అలుసుగా తీసుకోవడం అన్యాయమని అందరూ అంటున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే పవన్‌ ఈ విషయాన్ని మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా)కు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలుస్తోంది. తాజా సమాచారం ఏమింటే ఈ చిత్ర డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు సైతం ఇదే నిర్మాత ఆ సినిమా విషయంలో రెమ్యూనరేషన్‌ బాకీ పడ్దాడు. దీంతో త్రివిక్రమ్‌ సైతం తన బకాయిల విషయమై కంప్లైట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఎంత మొత్తం ఆ నిర్మాత త్రివిక్రమ్‌కు బకాయి పడి రెమ్యూనరేషన్‌ ఎగ్గొట్టాడో ఖచ్చితంగా తెలియడం లేదు కానీ త్రివిక్రమ్‌ సైతం తన బకాయి వసూలు కోసం నిర్మాతపై ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ