Advertisementt

కుర్రాడు మరో హిట్‌ కొట్టేలా ఉన్నాడు..!

Tue 12th Jan 2016 04:45 PM
raj tarun,seethamma andalu ramayya sithraalu,cinema trailer,punch dialogues   కుర్రాడు మరో హిట్‌ కొట్టేలా ఉన్నాడు..!
కుర్రాడు మరో హిట్‌ కొట్టేలా ఉన్నాడు..!
Advertisement
Ads by CJ

హ్యాట్రిక్‌ హిట్స్‌తో ప్రామిసింగ్‌ హీరో అనిపించుకున్నాడు హీరో రాజ్‌తరుణ్‌. కాగా ఇప్పుడు ఆయన మరో హ్యాట్రిక్‌కు సిద్దమవుతున్నాడని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఇప్పుడు అదే జోష్‌తో మరో హిట్‌ని ఖాతాలో వేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. 'సీతమ్మ అందాలు... రామయ్య సిత్రాలు' ట్రైలర్‌ చూస్తుంటే మరో హిట్టు గ్యారంటీ అనే ఫీలింగ్‌ కలుగుతోంది. ఫుల్‌లెంగ్త్‌ సరదాగా, ఫన్‌తో, పంచ్‌ డైలాగ్‌లతో సాగిపోయింది ఈ చిత్ర ట్రైలర్‌. పంచ్‌ల మీద పంచ్‌లు అదరగొడుతున్నాయి. 'సినిమాలో హీరోలు కూడా నాలాగే ఫస్టాఫ్‌లో ఖాళీగా ఉంటారే... సెకండాఫ్‌లో బిజీ అయిపోతారు...', 'నీ లవ్‌ వన్‌సైడా.. టూ సైడా.. లేక సూసైడా.. ఈ రోజుతో తేలిపోవాల్సిందే..', 'వీడేం మారలేదు. అప్పుడు ఎదవే... ఇప్పుడు ఎదవే' లాంటి పంచ్‌లు భలే పేలుతున్నాయి. మొత్తమ్మీద హిట్‌ సినిమాకు కావాల్సిన క్వాలిటీస్‌ అన్నీ ఈ చిత్రం ట్రైలర్‌లో కనిపిస్తున్నాయి. మరి.. రిజల్ట్‌ ఎలా ఉంటుందో చూడాలి..!

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ