Advertisementt

ఫ్యామిలీకి హీరోల సమయం..!

Mon 11th Jan 2016 07:49 PM
ntr,nannaku prematho,allu arjun,ramcharan,brucelee movie  ఫ్యామిలీకి హీరోల సమయం..!
ఫ్యామిలీకి హీరోల సమయం..!
Advertisement
Ads by CJ

పాతతరం హీరోలు ఏడాదికి దాదాపు నాలుగైదు చిత్రాల్లో నటిస్తూ.. మూడు నాలుగు షిప్ట్స్‌లో పనిచేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేవారు. దాంతో వారికి తమ ఫ్యామిలీతో గడపడానికి సమయం దొరికేది కాదు. కానీ నేటితరం స్టార్‌ హీరోలు మాత్రం ఏడాదికి ఒకటిరెండు సినిమాల్లో మాత్రమే నటిస్తూ, అవకాశం, టైమ్‌గ్యాప్‌ ఉన్న సమయాన్ని పూర్తిగా తమ ఫ్యామిలీ కోసమే కేటాయిస్తున్నారు. ఇందులో మొదటగా వినిపించే పేరు సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు. ఆయన ఏడాదిలో దాదాపు అరడజను సార్లు ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో గడిపి వస్తుంటాడు. సినిమా పూర్తయిన తర్వాతే కాదు... షూటింగ్‌ మధ్యలో గ్యాప్‌ దొరికినా.. న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ జరుపుకోవాలన్నా సరే సమయం దొరికిందే ఆలస్యం ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో వాలిపోతుంటాడు. ఇక ఎన్టీఆర్‌ కూడా తన గ్యాప్‌ దొరికితే చాలు ఫ్యామిలీకి కావాల్సినన్ని రోజులు కేటాయిస్తున్నాడు. 'నాన్నకు ప్రేమతో' షూటింగ్‌లో లండన్‌లో ఎక్కువ రోజులు గడిపిన ఎన్టీఆర్‌ అక్కడ తనకు బ్రేక్‌ రాగానే ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లి వచ్చాడు. ఇక ఈ చిత్రం విడుదలైన అనంతరం కూడా మరో క్యాంప్‌కు ప్లాన్‌ చేస్తున్నాడు ఎన్టీఆర్‌. అల్లుఅర్జున్‌ కూడా గ్యాప్‌ దొరికితే చాలు తన కొడుకుతో ఆటాడుకొంటూ ఉంటాడు. వాటి విశేషాలను, పొటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూ తన అనందాన్ని అభిమానులతో కూడా పంచుకొంటుంటాడు.ఇక రామ్‌చరణ్‌ కూడా అంతే. ఆయన తాజాగా తన 'బ్రూస్‌లీ' చిత్రం విడుదలైన తర్వాత విదేశాలకు టూర్‌ వెళ్లి వచ్చాడు. ఇలా తమ కుటుంబాలకు ప్రాణ సమానంగా చూసుకుంటూ మొదట ఫ్యామిలీ.. తర్వాతే సినిమా అంటూ చాటుతున్నారు నేటితరం స్టార్స్‌. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ