Advertisementt

హాట్‌ హాట్‌ ఏప్రిల్‌...!

Mon 11th Jan 2016 07:32 PM
sardhar gabbar singh,brahmothsawam,sarainodu  హాట్‌ హాట్‌ ఏప్రిల్‌...!
హాట్‌ హాట్‌ ఏప్రిల్‌...!
Advertisement
Ads by CJ

ఇప్పటి సంక్రాంతి సీజన్‌లో నాలుగు సినిమాలు విడుదల అవుతుంటే రాబోయే సమ్మర్‌లోనూ నాలుగైదు సినిమాలు పోటీపడటానికి రెడీ అవుతున్నాయి. ఈ సంక్రాంతి సీజన్‌ కంటే సమ్మర్‌లో వస్తున్న చిత్రాలే పెద్ద పెద్దవి కావడం... దాదాపు ముగ్గురు స్టార్స్‌ సినిమాలే రానుండటం విశేషంగా చెప్పాలి. బాబి దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్‌ హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' చిత్రం ఏప్రిల్‌ 8న రానున్నట్లు చెబుతున్నారు. ఇక అదే రోజున బన్నీ తన పుట్టినరోజు కానుకగా 'సరైనోడు'ను రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నాడు. డేట్లు మారినప్పటికీ వీరిద్దరు అదే నెలలో మాత్రం ఖచ్చితంగా రావడం ఖాయం. ఇక మహేష్‌బాబు నటిస్తున్న 'బ్రహ్మూెత్సవం' చిత్రం ఏప్రిల్‌ 29న విడుదలకు ముస్తాబవుతోంది. మరోవంక యువహీరోలైన సాయిధరమ్‌తేజ్‌-దిల్‌రాజుల 'సుప్రీమ్‌', నాగచైతన్య 'మజ్ను' చిత్రాలను కూడా ఏప్రిల్‌లోనే విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారట. మొత్తానికి ఈ సంక్రాంతి లాగానే రాబోయే సమ్మర్‌ కూడా మంచి హాట్‌ను పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ