Advertisementt

ఎన్టీయార్ చేయాల్సిన ఊపిరి!

Mon 11th Jan 2016 04:37 PM
jr ntr,nagarjuna,oopiri  ఎన్టీయార్ చేయాల్సిన ఊపిరి!
ఎన్టీయార్ చేయాల్సిన ఊపిరి!
Advertisement
Ads by CJ

జూనియర్ ఎన్టీయార్ కూడా అందరు హీరోల్లాగా మల్టీస్టారర్ సినిమాలు చేస్తే చూసి ఆనందించాలని అభిమానులకు, సగటు ప్రేక్షకులకి తప్పకుండా ఓ కోరిక ఉంటుంది. కానీ ఏది జరగాలన్నా సరైన కథ, దర్శకుడు దొరకాలి కదా. అన్నింటికంటే ముందు కరెక్ట్ టైం పడాలి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న ఊపిరి సినిమా కోసం ముందుగా నాగార్జున, జూనియర్ ఎన్టీయార్ గార్లనే సంప్రదించారు. ఇందుకు నాగార్జున కూడా పచ్చ జెండా ఊపేసి తారక్ మీదే భారం వేసారు. కానీ దురదృష్టవశాత్తు జూనియర్ అప్పటికే నాన్నకు ప్రేమతో కోసం కాల్షీట్స్ అన్నీ పంచేయడంతో వంశీ ఆఫర్ సున్నితంగా తిరస్కరించాడు. తప్పేది లేక తమిళ హీరో కార్తీతో ఆ రోల్ భర్తీ చేసారు. ఇదే విషయాన్ని ఎన్టీయార్ కూడా నిన్న జరిగిన ముఖాముఖీ సంభాషణలో చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి అవకాశం మరోసారి దొరికితే తప్పకుండా నందమూరి అభిమానుల కోరిక, అక్కినేని అభిమానుల కోరిక తీరొచ్చు. అప్పటిదాకా మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో నాగార్జున, ఎన్టీయార్లను చూసి సంబరపడిపోదాం. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ