Advertisementt

ప్రస్తుతం పొడవాటి ట్రెండ్ నడుస్తోంది..!

Fri 08th Jan 2016 01:54 PM
long and lengthy titles,tollywood trend,nani,krishnagaadi veera premagadha movie,lengthy titles trend  ప్రస్తుతం పొడవాటి ట్రెండ్ నడుస్తోంది..!
ప్రస్తుతం పొడవాటి ట్రెండ్ నడుస్తోంది..!
Advertisement
Ads by CJ

సినిమాల కథల్లోనే కాదు... టైటిల్స్‌లో కూడా కాలానుగుణంగా ట్రెండ్‌ నడుస్తూ ఉంటుంది. రెండు అక్షరాల పేర్లు, మూడక్షరాల పేర్లు, ఇంగ్లీష్‌ టైటిల్స్‌... ఇలా కొన్నికొన్నిరోజుల్లో కొన్ని రకాల టైటిల్స్‌ రాజ్యమేలుతూ ఉంటాయి. అయితే  ఈ మధ్య లెంగ్తీ టైటిల్స్‌ను పెట్టడానికి దర్శకనిర్మాతలు, హీరోలు సంకోచించడం లేదు. దీంతో పొడవాటి టైటిల్స్‌తో సినిమాలు వస్తున్నాయి. మహేష్‌బాబు, వెంకటేష్‌లు హీరోలుగా మల్టీస్టారర్‌గా తెరకెక్కిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' ల ద్వారా ఈ లెంగ్తీ టైటిల్స్‌ మరలా ఊపందుకున్నాయి. అప్పటి నుండి ఈ ట్రెండ్ కొనసాగుతూనే వుంది. అదెలా అంటే.. హీరో నాని విషయానికి వస్తే 'జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రహ్మణ్యం, ఎటో వెళ్లిపోయింది మనసు, భలే భలే మగాడివోయ్‌' వంటి చిత్రాలన్నీ కాస్త లెంగ్తీ టైటిల్సే. ఇక తాజాగా నాని చిత్రానికి 'కృష్ణాగాడి వీర ప్రేమగాథ' టైటిల్‌ కూడా పెద్దదే. రాజ్‌తరుణ్‌ 'సీతమ్మ అందాలు... రామయ్య సిత్రాలు' అనే టైటిల్‌తో, నాగచైతన్య 'సాహసం శ్వాసగా సాగిపో', శర్వానంద్‌ 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయనా' వంటి చిత్రాలన్నీ భారీ టైటిల్స్‌ లెక్కనే చేరుతాయి. తాజాగా వచ్చిన మోహన్‌బాబు, అల్లరినరేష్‌ల 'మామ మంచు... అల్లుడు కంచు', రాబోయే 'సర్దార్ గబ్బర్ సింగ్' కూడా ఇదే కోవకి చెందినవే కావడం గమనార్హం. మరి ఈ ట్రెండ్‌ ఎంతకాలం కొనసాగుతుందో? మన డైరెక్టర్స్ కి మళ్లీ మూడ్ ఎప్పుడు మారుతుందో..? 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ