Advertisementt

గుండెను పిండేస్తున్న ట్రైలర్!

Tue 05th Jan 2016 03:08 PM
air lift trailer,akshay kumar  గుండెను పిండేస్తున్న ట్రైలర్!
గుండెను పిండేస్తున్న ట్రైలర్!
Advertisement
Ads by CJ

ఎంతటి కరడుగట్టిన మనిషినైనా జాతీయతా భావంతో కొడితే ఇట్టే ద్రవించిపోతాడు. అందుకే మనమంతా  భారతీయులం అని చాటిచెప్పే యునీక్ సినిమాలకు ఎప్పుడూ బ్రహ్మాండమైన గిరాకీ ఉంటుంది. ఆ కోవకే చెందిన హిందీ సినిమా ఎయిర్ లిఫ్ట్ ఇప్పుడు అంతటా చర్చనీయాంశం అయింది. నెల కిందట విడుదల చేసిన మొదటి ట్రైలర్, ఇదిగో ఇప్పుడొచ్చిన రెండో ట్రైలర్ గుండెను పిండేసేలాగా ఉంది. ఆగష్టు 2 1990లో కువైట్ పైన ఇరాక్ సేనలు దాడి చేసినప్పుడు అక్కడ బందీలుగా చిక్కుకున్న సుమారు ఒక లక్షా డెబ్బై వేల మంది భారతీయుల్ని ఇండియన్ ఆర్మీ సాయంతో 488 ఏరో ప్లేన్లు ఉపయోగించి 59 రోజుల్లో ఎయిర్ లిఫ్ట్ చేసిన ఓ యదార్థ సంఘటనకు దృశ్య రూపమే ఈ సినిమా. ఇందులో హీరో అక్షయ్ కుమార్ కువైట్ నగరంలో స్థిరపడిన ఓ సంపన్న వ్యాపారవేత్త రంజిత్ కాత్యాల్ పాత్రను పోషించాడు. రాజ కృష్ణ మీనన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 22న విడుదల కానుంది. ప్రతి భారతీయుడు గర్వపడేలా, మనలోని ఐకమత్యాన్ని చాటేలా, భారతీయుడు ఎక్కడున్నా భారతీయుడే అని ప్రపంచం మొత్తం తలెత్తి సెల్యూట్ చేసేలా ఎయిర్ లిఫ్ట్ ఉండబోతుంది అన్నది ఈ మూడు నిమిషాల ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ