Advertisementt

మహేష్‌పై ఎన్టీఆర్‌ ఆధిపత్యం..!

Tue 05th Jan 2016 11:09 AM
mahesh babu,brahmothsawam,ntr,nannaku prematho  మహేష్‌పై ఎన్టీఆర్‌ ఆధిపత్యం..!
మహేష్‌పై ఎన్టీఆర్‌ ఆధిపత్యం..!
Advertisement
Ads by CJ

మహేష్‌బాబు నటిస్తున్న సినిమా 'బ్రహ్మోత్సవం'. న్యూఇయర్‌ గిఫ్ట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్‌ ఎన్టీఆర్‌ 'నాన్నకు ప్రేమతో' థియేటర్‌ ట్రైలర్‌తో పోటీపడలేకపోయింది. సుమారు 'బ్రహ్మోత్సవం'కు 5.45లక్షల వ్యూస్‌ రాగా 'నాన్నకు ప్రేమతో' సినిమాకు 7.5 లక్షల వ్యూస్‌ వచ్చాయి. మరోవైపు మహేష్‌ సినిమాకు 11000 లైక్స్‌ ఉంటే... 24,500 లైక్స్‌తో దూసుకెళ్లాడు ఎన్టీఆర్‌. ఈ రెండు చోట్లా మహేష్‌ ఎన్టీఆర్‌ను దాటలేకపోయాడు. నిజానికి 'బ్రహ్మోత్సవం' క్లాసికల్‌గా కనిపించడం.... కేవలం అది టీజర్‌ అవ్వడం వల్లే తక్కువ లైక్స్‌ వచ్చాయని అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్‌ సినిమా సంక్రాంతి బరిలో ఉండడం, ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందులోనూ ఈసారి ఎన్టీఆర్‌ బాబాయ్‌ బాలకృష్ణతో బాక్సాఫీస్‌ వద్ద పోటీపడుతుండటం వీక్షకుల సంఖ్య పెరగడానికి ముఖ్యకారణం అంటున్నారు. దీనికి తగ్గట్లుగా సుకుమార్‌ స్టైలిష్‌ మేకింగ్‌ ఈ చిత్రానికి స్పెషల్‌ అట్రాక్షన్‌గా మారింది. కాగా 'బ్రహ్మోత్సవం' చిత్రం ఎప్పుడో ఏప్రిల్‌ 29న రిలీజ్‌ అయ్యే సినిమా కావడంతో మహేష్‌ ఎన్టీఆర్‌తో పోటీపడలేకపోయాడని మహేష్‌బాబు అభిమానులు వాదిస్తున్నారు. కాగా 'బ్రహ్మోత్సవం' టీజర్‌లోని సాంగ్‌ కాపీ అని రుజువులతో సహ మహేష్‌ యాంటీ ఫ్యాన్స్‌ చూపిస్తున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ