కొత్త పాత్రలో యంగ్‌ రెబెల్‌స్టార్‌...!

Mon 04th Jan 2016 12:12 PM
prabhas,bahubali,bahubali 2,sujeeth,crime comedy movie  కొత్త పాత్రలో యంగ్‌ రెబెల్‌స్టార్‌...!
కొత్త పాత్రలో యంగ్‌ రెబెల్‌స్టార్‌...!
Advertisement

దాదాపు రెండేళ్ల పాటు కష్టపడి 'బాహుబలి' చిత్రం చేసిన ప్రభాస్‌కు ఆ శ్రమ ఊరికే పోలేదు. ఆయనకు దేశవిదేశాల్లో కూడా మంచి క్రేజ్‌ వచ్చి ఆయనను పీక్స్‌కి చేర్చింది. తాజాగా ఆయన 'బాహుబలి పార్ట్‌2' కోసం కష్టపడుతున్నాడు. ఈ చిత్రం విడుదలైతే ఇక ప్రభాస్‌ క్రేజ్‌ ఆకాశాన్ని అంటడం ఖాయమనే అంటున్నారు. అయితే ఆయన ఎప్పుడో 'రన్‌రాజా రన్‌' ఫేమ్‌ సుజీత్‌ డైరెక్షన్‌లో ఓ చిత్రం చేస్తానని మాట ఇచ్చాడు. ఈ చిత్రాన్ని కూడా తన సొంత సంస్థ వంటి యువి క్రియేషన్స్‌ బేనర్‌లోనే చేయనున్నాడన్న విషయం తెలిసిందే. కాగా టాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు పోలీస్‌ పాత్రలంటే మక్కువ ఎక్కువ. ఇప్పటికే దాదాపు అందరు స్టార్స్‌ పోలీస్‌ పాత్రలో ఖాకీ దుస్తులు ధరించి రెండు మూడు చిత్రాలు చేసేస్తున్నారు. కాగా ఆరున్నర అడుగుల పొడవు, సిక్స్‌ప్యాక్‌ను మించిన బాడీ, ఆజానుబాహుడైన ప్రభాస్‌ పోలీసు పాత్రలకు అద్భుతంగా సూట్‌ అవుతాడు. కానీ ఆయనకు ఇప్పటివరకు అలాంటి పాత్ర రాకపోవడమే విచిత్రం. అయితే ఆయన పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన 'ఏక్‌ నిరంజన్‌' చిత్రంలో పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. కాగా 'బాహుబలి 2' తర్వాత ఆయన సుజీత్‌ డైరెక్షన్‌లో చేయబోయే చిత్రం ఓ పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారి కథ అని, ఇందులో ప్రభాస్‌ ఖాకీ డ్రస్సులో కనిపించనున్నాడని, ఈచిత్రం ఇప్పటివరకు రానంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని, ఇది క్రైమ్‌ కామెడీకి సంబంధించిన కథగా తెలుస్తోంది. 'బాహుబలి2' తర్వాత ప్రభాస్‌ నటించే చిత్రంపై అంచనాలు పీక్స్‌లో ఉంటాయి. కాబట్టి ఆయన ఇలాంటి వైవిధ్యమైన చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడని తెలిసి ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 


Loading..
Loading..
Loading..
advertisement