'ఖడ్గం' సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ దైలాగ్‌తో యమ ఫేమస్ అయిన కమెడియన్ పృథ్వీ. తన కెరీర్‌లో ఆయన ఇప్పటివరకు ఎన్నో చిత్రాలలో నటించినప్పటికీ 'లౌక్యం' సినిమాతో పృథ్వీ దశ తిరిగింది. ఈమధ్యకాలంలో ఆయన ప్రతి చిత్రంలోనూ తనదైన శైలిలో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతున్నాడు. ఆయన దెబ్బకు బ్రహ్మానందంకు రావాల్సిన క్యారెక్టర్లు కూడా పృథ్వీకి వెళ్లిపోతున్నాయి. ఆయన కోసం మన దర్శకరచయితలు ప్రత్యేక పాత్రలను సృష్టిస్తున్నారు. దీంతో వరుస చిత్రాలతో ఆయన తన విశ్వరూపం చూపిస్తున్నాడు. పృథ్వీకి డిమాండ్ పెరగడంతో అతని డేట్స్ ముందే బుక్ చేసుకోవడానికి నిర్మాతలు పోటీలు పడుతున్నారు. గతంలో ఆయన రోజుకు 50వేలు తీసుకునే వాడు. కానీ ఇప్పుడు ఆయన రోజుకు రెండు లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కాగా త్వరలో ఆయన నటించే మరికొన్ని భారీ చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. అవి కూడా హిట్టయితే రోజుకు ఐదు లక్షల చొప్పున డిమాండ్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కాగా మరికొందరు ఆయన క్రేజ్‌ను క్యాష్ చేసుకునే ప్రయత్నంలో ఆయనను హీరోగా పెట్టి సినిమాలు తీయాలని ప్లాన్ చేస్తున్నారు.





Loading..