Advertisementt

రోబో 2.0లో ఎమోషన్స్ సంగతేంటి?

Wed 30th Dec 2015 05:33 PM
robo 2.0,rajinikanth story,akshay kumar  రోబో 2.0లో ఎమోషన్స్ సంగతేంటి?
రోబో 2.0లో ఎమోషన్స్ సంగతేంటి?
Advertisement
Ads by CJ

మనిషికి యంత్రానికి తేడా ఏమిటో దర్శకుడు శంకర్ భాషలో చెప్పిన రోబో చూస్తే ప్రతి ప్రేక్షకుడికీ తెలుస్తుంది. ఇనుములో హృదయం మొలిచెలే అంటూ రోబోలకి సైతం న్యూరళ్ స్కీమా అనే టెక్నికల్ పరిభాషను వాడుతూనే కామన్ ఆడియెన్సు హృదయాన్ని హద్దుకునే ఎమోషన్ పండించిన తీరు రోబోలో  ఉన్న అద్భుతమైన స్టోరీ ఎలిమెంటు. మళ్ళీ శంకర్ అదే రకమైన హ్యూమన్ టచింగ్ ఎలిమెంటు వాడితేనే రోబో 2.0 జనానికి ఎక్కేది. రజినీకాంత్ హీరోగా, అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా ప్రస్తుతం రూపుదిద్దుకునే పనిలో ఉన్న రోబో 2.0 స్టోరీ ఇదిగో అంటూ అంతర్జాలంలో ఓ కథ చక్కర్లు కొడుతోంది.                   

చిట్టీని పూర్తిగా డిస్ మ్యాన్టిల్ చేసి మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టేసిన సైంటిస్ట్ వశీకర్ చిట్టీలోని లోపాలను సరిదిద్ది రోబో 2.0 అంటూ మళ్లీ రజినీకాంత్ ముఖంతోనే  బైటికి తెస్తారు. కానీ అదే ల్యాబులో రాంగ్ కోడింగ్ వాళ్ళ ఇంకో పవర్ ఫుల్ విలన్ రోబో రూపంలో అక్షయ్ కుమార్ కూడా తయారవుతాడు. మరి రజిని, అక్షయ్ కుమార్ల స్పీడు ఒక్కటేనా? ఇద్దరిలో ఎవరు అడ్వాన్స్ టెక్నాలజీతో తయారు చేయబడ్డారు? చిట్టి 2.0 చివరాఖరికి విలన్ రోబోని ఎలా మట్టుపెట్టింది అన్నదే కథంతా.

వినడానికి స్టోరీ బాగానే ఉన్నా, శంకర్ స్క్రిప్ట్ ఎలా ఉండబోతోంది? మానవత్వం పరిమళించేలా మొదటి భాగంలో చిట్టి చేసినటువంటి పనులు ఈసారి చిట్టి 2.0 కూడా చేస్తుందా లేక చిట్టి వర్సెస్ అక్షయ్ కుమార్ పోరాటాల మీదే ఫోకస్ ఉంటుందా అన్నది మరికొన్నాళ్ళు ఆగితేనే తెలుస్తుంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ