నాన్నకు ప్రేమతో ట్రైలర్ రివ్యూ

Mon 28th Dec 2015 03:45 PM
nannaku prematho trailer review,sukumar,jr ntr  నాన్నకు ప్రేమతో ట్రైలర్ రివ్యూ
నాన్నకు ప్రేమతో ట్రైలర్ రివ్యూ
Advertisement
Ads by CJ

సూపర్ స్టైల్ ఎన్టీయార్ లుక్కేనా లేక కథలో కూడా అదే కిక్కు ఉంటుందా అని అభిమానులు, సామాన్య ప్రేక్షకులు నాన్నకు ప్రేమతో పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ దర్శకుడు సుకుమార్ అందరినీ ఆశ్చర్యపరిచేలా కొత్త థియేట్రికల్ ట్రైలర్ వదిలారు. ఇక ఈ ట్రైలర్ క్లుప్తంగా సినిమాలోని స్టోరీ ఎలిమెంట్ మీదే ఫోకస్ అయి ఉండేలా రూపొందించారు. ఓ కోటీశ్వరుడైన, బిజినెస్ మ్యాగ్నేట్ తండ్రి రాజేంద్ర ప్రసాద్ గారి కొడుకు ఎన్టీయార్. వీరికి రైవల్ కృష్ణ మూర్తి జగపతి బాబు. మోసం చేస్తేనే పైకి వస్తామనే ఫిలాసఫీ ఇతనిది. మరి తండ్రికి ఎటువంటి అన్యాయం జరిగిందో ట్రైలర్లో చూపించలేదు గానీ కొడుకుగా తన నాన్న మీదున్న ప్రేమతోనే తప్ప విలన్ కృష్ణమూర్తి మీద ఉన్న కోపంతో కాదనేట్టుగా ఆడిన ఓ గేమ్ ఈ సినిమాలోని కథాంశం. దీనికి సుకుమార్ ట్రీట్మెంట్, భోగవల్లి ప్రసాద్ గారి నిర్మాణ విలువలు స్పెషల్ హైలైట్లుగా నిలిచినట్టు కనిపిస్తోంది. మనుషులను జంతువులను వేరు చేసేది ఎమోషన్, ప్రకృతిలో అన్నీ ఇంటర్ లింక్ అయుంటాయి, ఎటువంటి కష్టాన్నైనా చిరునవ్వుతో ఎదుర్కోవడం మా నాన్నను చూసే నేర్చుకున్నాను, ఓడిపోయే గేమ్ నేనెప్పుడూ ఆడలేదు అనేటువంటి రకరకాల డైలాగులు నాన్నకు ప్రేమతోని తప్పకుండా ఓ ఉన్నత విలువలు చాటి చెప్పే సినిమాగా నిలబెట్టేలా ఉన్నాయి. ఆల్ ఇన్ ఆల్, ఇది ఒక సూపర్ కూల్ ట్రైలర్.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ