Advertisement

మల్లె పుష్పం మళ్ళీ వికసించింది

Sun 27th Dec 2015 01:37 PM
mallepushpam rama rao,prudhvi,bhale manchi roju  మల్లె పుష్పం మళ్ళీ వికసించింది
మల్లె పుష్పం మళ్ళీ వికసించింది
Advertisement

సినిమా రన్ టైం రెండున్నర గంటలు సాంతం ఓహో అద్బుతంగా ఉండాలని కోరుకునేంత దురాశ నేటి సగటు తెలుగు సినీ ప్రేక్షకుడికి లేదు. ఏదో ఫస్ట్ హాఫ్ అయినా లేక సెకండ్ హాఫ్ అయినా, రెండు కథాబలం ఉన్న సీన్లు, ఒకటో రెండు సరిగ్గా రాసుకున్న కామెడీ సన్నివేశాలు మా మొహం మీద పడేస్తే మీ సినిమాకు వచ్చేస్తాం అనే దీన స్థితిలో ఉన్నాం. దిగజారిపోతున్న ఈ స్టాండర్డ్స్ కాపాడుకోవడం ఏ ఒక్కరి వల్లో కాదు కనకనే వడ్డించిన వాటిలో నచ్చింది తీసుకుంటున్నాం, పనికిరానిది వదిలేస్తున్నాం. ఇలా అందరికీ నచ్చే ఒక్క కామన్ ఐటెం 30 ఇండస్ట్రీ ఆర్టిస్ట్ పృథ్వీ. ఈ మధ్య కాలంలో వస్తున్న ప్రతి సినిమాలోను పృథ్వీకి ఓ పాత్రని రాసేసి దాన్ని ఎక్కడో ఒక చోట ఇరికించేసే పనిలో రచయితలు, దర్శకులు తెగ తాపత్రేయపడిపోతున్నారు. మొన్న సౌఖ్యంలో ఈ ఫీట్ పండక పోయినా, నిన్న వచ్చిన భలే మంచి రోజులో మాత్రం పృథ్వీ పాత్ర భలే భలే పండింది. జూనియర్ ఆర్టిస్ట్ మల్లె పుష్పం రామారావు పాత్రలో పృథ్వీ చేసిన కామెడీ సినిమా ఫలితాన్నే మార్చేసింది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అంతంత మాత్రంగానే ఉన్న భలే మంచి రోజు ఈరోజు ఒక మంచి అటెంప్ట్ అంటూ ప్రేక్షకులు ఫస్ట్ క్లాసులో పాస్ చేసారంటే అందుకు మల్లె పుష్పం చేసిన సాయం అంతా ఇంతా కాదు. ప్రతి డైలాగు కొత్తగా రాయడానికి నేనేమైనా కోన వెంకట్ అనుకున్నావ్ రా... అంటూ మల్లె పుష్పంలో హాస్యం వికసిస్తుంటే జనాలు బాగా ఆనందపడుతున్నారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement