Advertisementt

వణుకుతోన్న బాలయ్య ఫ్యాన్స్!

Sat 26th Dec 2015 05:57 PM
balakrishna,dictator,kona venkat  వణుకుతోన్న బాలయ్య ఫ్యాన్స్!
వణుకుతోన్న బాలయ్య ఫ్యాన్స్!
Advertisement
Ads by CJ

చలికాలమే కదా, అందునా టెంపరేచర్లు తగ్గాయి కదా... చలి పెరిగి వణుకుతున్నారేమో నందమూరి అభిమానులు అనుకునేరు. అది కానే కాదు. వీరికి కోన వైరల్ ఫీవర్ తగిలి ముసుగేసుకుని భయంతో వణికుతున్నారంటే నమ్మండి. కోన వెంకట్, గోపి మోహన్ పేర్లు కొన్ని నెలల క్రితం వరకూ టాలివుడ్ మొత్తాన్ని ఊపేసిన బ్రాండ్లు. కానీ ప్రతీ మందుకీ ఓ ఎక్స్పైరీ డేట్ ఉంటుందని వారు సెలవిచ్చినట్టే ఇప్పుడు వీరికీ ఆ డేట్ వచ్చింది. ఓ ఫార్ములాను కనిపెట్టి, ఇదే తెలుగు సినిమా భవిష్యత్తును నిర్దేశించేది అనేంతగా మన జనానికి అలవాటు చేసిన కోన మందు ఇక పారటం లేదు. అందుకు ఉదాహరణగా వరస పెట్టి త్రిపుర, బ్రూస్ లీ, అఖిల్, శంకరాభరణం, సౌఖ్యం చిత్రాలు మూడు నెలలు తిరిగేలోపు భూస్థాపితం అయ్యాయి. ఇక కోన ఖాతాలో మనకు బాగా తెలిసి మిగిలి ఉన్న ఒకే ఒక్క సినిమా బాలకృష్ణ డిక్టేటర్.  నిజానికి కోన బ్యాడ్ ఫేజ్ స్టార్ట్ అవకముందే ఒప్పుకున్న సినిమా డిక్టేటర్. తెలిసుంటే ఈ తప్పు జరగనిచ్చే వాళ్ళా చెప్పండి. దీనకన్నా పెద్ద రీజన్ కావాలా కోన పేరుతో జ్వరం రావడానికి! డిక్టేటర్ హిట్టయితే అందరూ ఒక్క దెబ్బతో కోలుకుంటారు... సో, భారం అంతా బాలకృష్ణ పైనే ఉంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ