Advertisement

తిరోగమనం వద్దు గోపీచంద్!

Sat 26th Dec 2015 05:11 PM
gopichand,soukhyam,oxygen  తిరోగమనం వద్దు గోపీచంద్!
తిరోగమనం వద్దు గోపీచంద్!
Advertisement

ఆర్టిస్టుగా గోపీచంద్ ప్రయాణం అష్ట వంకరలు తిరిగింది. T కృష్ణగారిలాంటి ప్రఖ్యాతి గాంచిన దర్శక నిర్మాత కొడుకైనా దర్శకత్వం వైపు వెళ్ళకుండా నటుడిగా స్థిరపడాలనుకున్నాడు. తొలివలపుతో హీరోగా ట్రై చేసి అటు పైన ప్రతినాయకుడిగా మారి అక్కడ ప్రూవ్ చేసుకుని మళ్ళీ హీరోగా విజయాలు సాధించి మధ్యలో  ఫ్లాప్ బాటలో నడిచి మొన్నే లౌక్యంతో ఓ దారికొచ్చాడు. అటు తరువాత జిల్ కూడా గోపీచంద్ చేసిన అన్ని సినిమాల్లోకెల్లా మోస్ట్ స్టైలిష్ అండ్ సుపర్బ్ ఫిలింగా ప్రశంసలు పొందింది. ఇంకేముంది గోపీచంద్ కెరీర్ మళ్ళీ గాడిలో పడిందని ఊరట పొందుతుంటే ఇదిగో ఇలా సౌఖ్యంతో అందరికీ దుఃఖాన్ని మిగిల్చాడు. కోన వెంకట్, గోపి మోహన్ ఇచ్చిన లౌక్యంవల్లే ఆనందాన్ని తిరిగి పొందగాలిగానని, వారి రుణాన్ని తీర్చుకోవడానికే గోపీచంద్ సౌఖ్యం స్క్రిప్టును ఒప్పుకున్నాడేమో అనిపించేలా ఉంది సినిమా. మరీ ఇదే కమర్షియల్ ఫార్ములాను నమ్ముకుంటే మనుగడ అసాధ్యం అని తెలిసే కాస్తంత డిఫరెంట్ కథ, కథనంతో AM రత్నం గారి ఆక్సీజన్ ఒప్పుకున్నాడేమో. ఏదేమైనా మరోసారి తిరోగమన దిశలోకి గోపీచంద్ కెరీర్ రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం! 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement