Advertisement

బ్రహ్మీకి పృధ్వీకి అదే తేడా!!

Fri 25th Dec 2015 01:40 PM
soukhyam,prudhvi,brahmanandam  బ్రహ్మీకి పృధ్వీకి అదే తేడా!!
బ్రహ్మీకి పృధ్వీకి అదే తేడా!!
Advertisement

తెలుగు సినిమా హాస్యం అంటే బ్రహ్మానందం తప్ప ఇంకెవరు గుర్తుకు రానంతగా మన జీవితాలతో ముడి వేసుకు పోయాడు ఈ పెద్ద మనిషి. అన్ని రోజులూ అందరికీ ఒకేలా ఉండవు కదా. కొన్ని మంచి రోజులు, కొన్ని చెడ్డ రోజులూ ఉంటాయి. దశాబ్దం పైబడిన సినీ కెరీర్లో బ్రహ్మానందం అన్ని రకాల రోజులను రుచి చూసారు. కానీ ప్రస్తుతం నడుస్తున్నది ఓ విచిత్రమైన దశ. రచయితల పెన్నుల్లో సిరా అయిపోయిందా లేక బ్రహ్మీ ఒంట్లో నవ్వించే సత్తా తగ్గిందా అనే స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్న వేళ బ్రహ్మానందానికి రీ ప్లేస్ మెంట్ అనేలా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ విజయవిహారం చేస్తున్నారు. ఒక సమయంలో బ్రహ్మానందం ప్రెజెన్స్ లేకుండా ఏ కొత్త తెలుగు సినిమా విడుదలయ్యేది కాదు. ఇప్పుడు పృథ్వీ కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతున్నాడు. కానీ తేడా ఏమిటంటే పట్టుమని పది పదిహేను వరస చిత్రాలు కాగానే పృథ్వీ బోరు కొట్టే లెవెల్ చేరిపోతున్నాడు. ఇవ్వాళ వచ్చిన సౌఖ్యంలో బాహుబలి, శ్రీమంతుడు సినిమాలను పృథ్వీ మీద స్పూఫ్ చేసి ఎటువంటి హాస్యం పండక అదోగతి పాలయ్యారు దర్శక నిర్మాతలు. ఇండస్ట్రీలో సస్టేన్ అవాలంటే సినిమా సినిమాకీ వైవిధ్యం ప్రదర్శిస్తూ తమకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని అలవర్చుకోవాలి. బ్రహ్మానందం గారు ఊరికే గొప్ప కమెడియన్ అయిపోలా. ఏళ్ళ తరబడి నిరాటంకమైన కృషి, తపన ఆయన ప్రయాణంలో నుండి మనం నేర్చుకోవాల్సింది ఉంది. అది గమనించకపోతే పృథ్వీ ఇంకో ఏడాది, అంత కన్నా ముందే కనుమరుగైపోవడం ఖాయం. 30 ఇయర్స్ శ్రమను 3 ఇయర్స్ కన్నా తక్కువలోనే వదులుకోవాలి. ఇట్స్ బెటర్... దిస్ విల్ నాట్ హ్యాపెన్!  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement