Advertisement

హీరోల క్రేజ్‌ను వాడుకొంటున్నారు..!

స్టార్‌హీరోల క్రేజ్‌ను వాడేసుకుంటూ పలువురు చిన్న చిత్రాల దర్శకనిర్మాతలు, హీరోలు తమ సినిమాకి క్రేజ్‌ తెప్పించే పని చేస్తున్నారు. 'బాహుబలి' భారీగా హిట్టయిన నేపథ్యంలో ప్రభాస్‌ రేంజ్‌ పీక్‌ స్టేజీకి వెళ్లింది. దీంతో ఓ సినిమాకు 'ఆవు పులి మద్యలో ప్రభాస్‌ పెళ్లి' అనే టైటిల్‌ను పెట్టి ఆయన క్రేజ్‌ను వాడుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పవన్‌కళ్యాణ్‌ అయితే పబ్లిక్‌ ప్రాపర్టీగా మారిపోయాడు. ఆయన టైటిల్స్‌, సాంగ్స్‌, ఆయనపై పొగడ్తలు.. ఇలా ఈ మధ్యకాలంలో ఎందరో తమ చిత్రాల్లో చూపిస్తున్నారు. ఇక 'పవనిజం' పేరుతో ఓ ఆల్బమ్‌ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడెప్పుడో మెగాస్టార్‌ చిరంజీవి పేరును వాడుకొంటూ 'శ్రీనుగాడు.. చిరంజీవి ఫ్యాన్‌' అనే చిత్రం తీశారు. ఇక మహేష్‌బాబును వాడుకొని 'సూపర్‌స్టార్‌ కిడ్నాప్‌' పేరుతో ఓ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా నాని కూడా 'జై బాలయ్య' అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడని సమాచారం. ఇక తమిళంలో కూడా 'రజనీ మురుగన్‌' పేరుతో రజనీ క్రేజ్‌ను వాడుకొంటూ శివకార్తికేయన్‌ ఓ చిత్రం చేస్తున్నాడు. ఇది ఆయా హీరోలకు కాస్త ఇబ్బందికరమైన విషయమే అయినప్పటికీ వారు కూడా సర్దుకుపోతున్నారు. 

prabhas
pawan kalyan
aavu puli madhyalo prabhas pelli
chiranjeevi
rajinikanth
mahesh babu