Advertisementt

బాలయ్యకు నో చెప్పిందట..!

Thu 24th Dec 2015 06:03 PM
nayanathara,balakrishna,dictator movie,item song  బాలయ్యకు నో చెప్పిందట..!
బాలయ్యకు నో చెప్పిందట..!
Advertisement
Ads by CJ

నందమూరి నటసింహం బాలకృష్ణ సరసన నటించే అవకాశం వచ్చిందంటే ఎవరైనా ఎగిరిగంతేస్తారు. ఎంత బిజీగా ఉన్నా డేట్స్‌ అడ్జస్ట్‌ చేస్తారు. పారితోషికం విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ బాలయ్యతో నటించమని నయనతారను అడిగితే నో చెప్పిందట. సారీ.. నాకు అంత టైమ్‌లేదు అని తప్పించుకొందిట. 'డిక్టేటర్‌' చిత్రంలో ఓ ఐటం గీతం కోసం ముమైత్‌ఖాన్‌ను తీసుకొన్న సంగతి తెలిసిందే. ఈ పాట కోసం మొదట నయనని సంప్రదించారట. 'సింహా, శ్రీరామరాజ్యం'లలో వీరిద్దరి జోడీ బాగా ఆకట్టుకుంది. ఆ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి. దీంతో సెంటిమెంట్‌గా కూడా కలిసొస్తుందని నయనని అప్రోచ్‌ అయింది చిత్రబృందం. అయితే నయన మాత్రం నో చెప్పింది. ఐటమ్‌సాంగ్‌ చేయడం నాకు ఇష్టం లేదని ఖరాఖండీగా చెప్పిందట. అయితే ఇదే సమయంలో ఆమె తమిళంలో విజయ్‌ నటించే చిత్రంలో ఐటమ్‌సాంగ్‌లో నర్తించే అవకాశం వస్తే ఒప్పుకొందిట. బాలయ్యకి నో చెప్పి... విజయ్‌కు ఎలా ఎస్‌ చెప్పింది? అంటూ 'డిక్టేటర్‌' యూనిట్‌ నయనపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ