Advertisementt

శివగామితో రాజమౌళి కష్టాలు..!

Thu 24th Dec 2015 01:34 PM
bahubali,rajamouli,ramyakrishna,remuneration matter  శివగామితో రాజమౌళి కష్టాలు..!
శివగామితో రాజమౌళి కష్టాలు..!
Advertisement
Ads by CJ

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొత్త రికార్డులను సృష్టించిన చిత్రం 'బాహుబలి'. ఈ సినిమాలో ఉన్న ప్రతి పాత్ర ఎంత హైలైట్ అయ్యిందో.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా శివగామి పాత్రలో రమ్యకృష్ణ నటనకు  ప్రేక్షకుల నుండి అశేష స్పందన లభించింది. ఈ క్రేజ్ తోనే బాహుబలి పార్ట్ 2 చేయడానికి రాజమౌళి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇటీవలే సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టారు. అయితే రమ్యకృష్ణ, రాజమౌళికి ఊహించని షాక్ ఇచ్చింది. నిజానికి 'బాహుబలి' రెండు భాగాలకు కలిపి రెమ్యునరేషన్ విషయంలో ఒకేసారి అగ్రిమెంట్ చేసుకున్నారు. కాని ఇప్పుడు రమ్యకృష్ణ తన రెమ్యునరేషన్ పెంచమని రాజమౌళిపై ఒత్తిడి తీసుకొస్తుందట. తన అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వకపోతే సినిమాలో నటించేదే లేదని ఖరాఖండిగా చెప్పిందట. రమ్యకృష్ణ అడిగినట్లుగా రెమ్యునరేషన్ పెంచితే మిగిలిన వారు కూడా డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో రాజమౌళికి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్య నుండి రాజమౌళి ఎలా బయటపడతాడో చూడాలి..! 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ