Advertisement

వచ్చే ఏడాది సమంత నామసంవత్సరం...!

Tue 22nd Dec 2015 04:46 PM
samantha,a aa movie,brahmothsawam,24 movie,vikram k kumar  వచ్చే ఏడాది సమంత నామసంవత్సరం...!
వచ్చే ఏడాది సమంత నామసంవత్సరం...!
Advertisement

చూస్తుంటే 2016వ సంవత్సరం సమంతనే కనిపించేటట్లు ఉంది. వచ్చే ఏడాది మొదటి నాలుగు నెలల్లో ఆమె నటిస్తున్న చిత్రాలు నాలుగు విడుదలకు సిద్దం అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె నాలుగు ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉంది. అవి కాక మరో రెండు చిత్రాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్‌ విషయానికి వస్తే ఆమె ప్రస్తుతం మహేష్‌బాబు, నితిన్‌, సూర్య, విజయ్‌,ధనుష్‌ చిత్రాల్లో నటిస్తోంది. కేవలం తన ప్లానింగ్‌లో ఎలాంటి క్లాస్‌ రాకుండా ఆమె జాగ్రత్తలు తీసుకోవడంతోనే ఇది సాధ్యం అవుతోంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌-నితిన్‌ల కాంబినేషన్‌లో ఆమె 'అ..ఆ' చిత్రంలో నటిస్తోంది. అలాగే మహేష్‌బాబు-శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో 'బ్రహ్మూెత్సవం'లో నటిస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఇక సూర్య సరసన విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న '24'లో ఆమె హీరోయిన్‌. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా భారీస్థాయిలో విడుదలకానుంది. ఇక విజయ్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలోనూ, ధనుష్‌ తాజా చిత్రంలో కూడా ఆమెనే హీరోయిన్‌గా నటిస్తుడటం విశేషం. మొత్తానికి సమంత చిత్రాలు ఇలా వరుసగా క్యూ కడుతుండటంతో ఆమె అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement