Advertisementt

బెల్లంకొండకు అంత సీన్‌ ఉందా..?

Sat 19th Dec 2015 04:31 PM
bellamkonda suresh,bellamkonda srinivas,speedunnodu movie,bhemaneni srinivasarao  బెల్లంకొండకు అంత సీన్‌ ఉందా..?
బెల్లంకొండకు అంత సీన్‌ ఉందా..?
Advertisement
Ads by CJ

నిర్మాత బెల్లంకొండ సురేష్‌ తనయుడు హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ 'అల్లుడు శీను'తో పరిచయం చేసి ప్రేక్షకులను ఫర్వాలేదనిపించాడు. కాగా ఆయన ప్రస్తుతం భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం తమిళంలో హిట్‌ అయిన 'సుందరపాండ్యన్‌'కు రీమేక్‌. వాస్తవానికి రీమేక్‌ చిత్రాలను తెరకెక్కించడంలో భీమనేని శ్రీనివాసరావు ఆరితేరిన దర్శకుడు. దాంతో తమిళ 'సుందర్‌పాండ్యన్‌'పై నమ్మకంతో పాటు భీమనేని శ్రీనివాసరావుపై ఉన్న నమ్మకంతో ఈ చిత్రం బిజినెస్‌ ఊపందుకొందని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. దీనికి 'స్పీడున్నోడు' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు ఈ చిత్రం విషయంలో అప్‌డేట్స్‌ లేవు. ఒక టీజర్‌ కానీ, ట్రయిలర్‌గానీ లేదు. అయినా కూడా ఈ చిత్రం ఇప్పటికే 18కోట్ల బిజినెస్‌ జరిగిందని, ఇంకా ఓవర్‌సీస్‌, అదర్‌ స్టేట్స్‌, శాటిలైట్‌ బిజినెస్‌ కాకముందే కేవలం ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఇంత బిజినెస్‌ జరిగిందని, దాదాపు రవితేజ లెవల్లో ఈ బిజినెస్‌ ఉందని వార్తలు షికారు చేస్తున్నాయి. కానీ ఈ సినిమాకు, ఈ హీరోకు అంత సీన్‌లేదని, ఇదంతా బయ్యర్లను ఆకట్టుకోవడానికి, సినిమాకు హైప్‌ తేవడానికి జరుగుతున్న తంతుగా ట్రేడ్‌ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి..!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ