Advertisementt

చిరుకి విల‌న్‌..దాదాపుగా క‌న్ఫ‌ర్మ్‌!

Fri 18th Dec 2015 06:39 PM
chiranjeevi,vivek oberoi,kaththi movie remake,vv vinayak,chiranjeevi villain vivek oberoi  చిరుకి విల‌న్‌..దాదాపుగా క‌న్ఫ‌ర్మ్‌!
చిరుకి విల‌న్‌..దాదాపుగా క‌న్ఫ‌ర్మ్‌!
Advertisement
Ads by CJ

చిరంజీవి 151వ సినిమాకి అడ్డంకుల‌న్నీ తొల‌గిపోయిన‌ట్టే.  ఒక్క హీరోయిన్ త‌ప్ప ఇక అన్ని విష‌యాలూ ఓకే అయిన‌ట్టే. ఆ  హీరోయిన్ ఎంపిక కూడా పెద్ద స‌మ‌స్యేమీ కాదంటోంది చిత్ర‌బృందం. సౌత్‌లో క‌థానాయిక‌ల డేట్లు అడ్జ‌స్ట్ కాక‌పోతే బాలీవుడ్‌కి వెళ్లి ఓ వెట‌రన్ హీరోయిన్‌ని ఎంపిక చేసుకోవాల‌నుకుంటుంన్నార‌ట‌.  విల‌న్‌గా మాత్రం వివేక్ ఒబెరాయ‌న్‌ని ఎంపిక చేసుకున్నట్టు ప‌క్కా స‌మాచారం. క‌త్తి ఒరిజిన‌ల్‌లో విల‌న్‌గా నీల్ నితిన్ దేశ్‌ముఖ్ న‌టించాడు. ఆయ‌న్ని తెర‌పై చూసిన ప్ర‌తి ఒక్క‌రూ విజ‌య్‌కి త‌గ్గ ప్ర‌తినాయ‌కుడు దొరికాడ‌న్నారు. అయితే చిరుకి కూడా ఆయ‌న్నే ఎంపిక చేసుకుంటే అంత‌గా సెట్ట‌వ్వ‌ద‌ని తెలుసుకున్న వినాయ‌క్ బృందం వివేక్ ఒబెరాయ్‌ని సంప్ర‌దించింద‌ట‌. చిరుకి కూడా వివేక్ ఒబెరాయ్ అంటే చాలా ఇష్టం. పైగా వివేక్ కూడా తెలుగులో మంచి రోల్స్ వ‌స్తే చేయాల‌ని ఎదురు చూస్తున్నాడు. ఇలా అన్నీ సెట్ట‌వ్వ‌డంతో విల‌న్‌గా వివేక్ ఎంపిక క్ష‌ణాల్లో ఖ‌రారైపోయిన‌ట్టు స‌మాచారం. ర‌క్త‌చ‌రిత్ర సినిమాల‌తో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకొన్నాడాయ‌న‌. చిరంజీవిలాంటి మాస్ హీరో ప‌క్క‌న అంతే మాస్ లుక్‌తో క‌నిపించే వివేక్ బాగానే ఉంటాడు. ఇక రేపోమాపో హీరోయిన్‌ని కూడా డిసైడ్ చేసి సినిమాని ప‌ట్టాలెక్కించాల‌నుకుంటోంది చిత్ర‌బృందం. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈచిత్రాన్నిరామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ